Saturday, April 5, 2014

నేను

















కొరుక్కుతినాలనిపించి
స్వయంగా దాచేసుకోవాలనిపించే అందాన్ని కావాలని
తినదగిన పదార్ధం రుచిని కావాలని ....

నేను

ఆకలి తీర్చగలిగిన .... ఏ రకంగా, ఎవరికైనా ఉపయోగపడగలిగిన
వేడి గా, రుచిగా సుచిగా ఉండి
ఆర్చుకుని, ఊరించేంత ఆరోగ్యకరమైన ఆశను కావాలని ....
నేను 

అందుబాటులో ఉండి, ఎవరూ గమనించరాదని
సామాన్యుడు .... తన పిడికిట్లో దాచుకోవాలనిపించే
స్వార్ధానికి అంకురాన్ని కావాలని ....
నేను

గాయపడి నలిపేయబడి డస్ట్ బిన్ లోకి విసిరేయబడి 
ఒక వృధా పదార్ధాన్ని కారాదని
అలసిన జీవితం లో .... అందమైన అనుభూతిని అయినా చాలని .....
నేను

2 comments:

  1. ప్రకృతిలోని ప్రతి ఒక్క " సృష్టి " వ్యర్ధమైపోకుండా,అర్ధవంతంగా ఉండాలి కోరుకోవడం చాలా ప్రశంసించదగిన విషయం చంద్రగారు.చాలా బాగుంది అద్భుతంగా.

    ReplyDelete
    Replies
    1. ప్రకృతిలోని ప్రతి ఒక్క " సృష్టి " వ్యర్ధమైపోకుండా,
      అర్ధవంతంగా ఉండాలి అని కోరుకోవడం చాలా ప్రశంసించదగిన విషయం
      చంద్రగారు.చాలా బాగుంది భావన అద్భుతంగా.
      చాలా బాగుంది ప్రేరణాత్మకంగా అభినందన స్నేహ ఆత్మీయ స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete