లోలో అనుకూల భావనలు
అంతా సవ్యంగానే జరుగుతుంది
సర్ధుకుందుకు సమయం అవసరం అని
కలలో .... అతని బాహువుల్లో
అనుకుంటూ
ఎలాంటి హానీ జరగదు అని
కానీ
లోలో ఎక్కడో ఏదో
గాయం సలుపుతున్న భావన
చీకటి వృత్తం లా మారి సుడులు తిరుగుతున్న
నొప్పి
అసూయ, వింత ఆరాటం
అతనికి కనపడనీయకుండా
పడుతున్న జాగ్రత్త
స్వేచ్చను పొందేందుకు చేసే ప్రయత్నం
అతని సమీపం లో
కలల కౌగిలిలో ఆమె పొందుతున్న
చిత్రమైన అనుభూతి
ఆ అనుభూతి ప్రభావాన్ని
తప్పు అర్ధం తీసుకోరాదని
వీలైనంత తొందరగా
మది మురికిని శుభ్రం చేసుకోవాలని
ప్రేమ భావనలను
వీలైనంతగా తగ్గించుకోవాలనే ప్రయత్నం
చిత్రం! జీవితం
నొప్పి, బాధలమయం
బాధలో తియ్యదనం వెదుక్కోవడం
మరొక్కసారి
మోస, న్యాయ మీమాంస లో
మనసును పిచ్చిదాన్ని గా మార్చుకోవడం
బాధలో తియ్యదనం వెదుక్కోవడం
ReplyDeleteమరొక్కసారి
మోస, న్యాయ మీమాంస లో
మనసును పిచ్చిదాన్ని గా మార్చుకోవడం..... బాగా చెప్పారు చంద్రా జీ
బాధలో తియ్యదనం వెదుక్కోవడం
Deleteమరొక్కసారి
మోస, న్యాయ మీమాంస లో మనసును పిచ్చిదాన్ని గా మార్చుకోవడం.....
బాగా చెప్పారు చంద్రా జీ
నా బ్లాగుకు స్వాగతం స్వేతా వాసుకీ గారు!
బాగుంది స్నేహ ప్రోత్సాహక అభినందన స్పందన
ధన్యవాదాలు స్వేతా వాసుకీ గారు! సుప్రభాతం!!
మనసును శాసించలేని నాడు తప్పవు కొన్ని బాధలు....
ReplyDeleteచంద్రగారు మీదైన శైలిలో చక్కగా వివరించారు.
మనసును శాసించలేని నాడు తప్పవు కొన్ని బాధలు....
Deleteచంద్రగారు మీదైన శైలిలో చక్కగా వివరించారు.
చక్కని స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక అభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!