పూలపానుపుపై
నా తలలో నా ఆలోచనల్లో నన్ను నిలదీస్తూ
కొంటెగా .... నవ్వులు రువ్వుతుంది నీ రూపమే
నిద్దుర నాకు తోడు రానంటుంది ....
......,
ఎందుకో అనిపిస్తుంది
నీవు, స్థిమితంగా కూర్చుని,
నా హృదయం తో ....
ఆటాడుకుంటూ ఉన్నావేమో అని.
ఆ ప్రభావమే నన్నిలా తపించేలా చేస్తుంది అని.
తెలుసుగా చెలీ .... అది న్యాయం కాదు.
కేవలం
ఒక ఆటే ప్రేమ అని .... అనుకోలేను.
చిలికి చిలికి జల్లు గాలివానైనట్లు
ప్రేమ జూదం
ఆకర్షణల పాచికల ఆటలో .... నన్నోడి
అధర్మంగా నీకు దాసుడ్ని అయ్యానని.
అలా ఆలోచిస్తే చాలా కష్టం గా ఉంటుంది.
అయినా,
నిజం గా నా ఓటమి
నిన్ను సంతోషంగా ఉంచగలిగితే
ఆ ఆనందం చాలదూ .... ఈ జీవన సాఫల్యానికి
నేను కలలు కన్నది నిన్నే
నిజం చెబుతున్నా!
నీ ప్రేమ లేని అస్తిత్వం .... లేదు నాకు.
నీలోనే నివశిస్తూ
నిన్నే నేను కలలు కంటుంది,
నేను పూజిస్తుంది,
జీవిస్తుంది,
నిన్ను ప్రాప్తించుకునేందుకే .... అని నీకు తెలుసు!
ఒంటి స్తంభము మేడలో ....
ఒంటరిగా ముస్తాబించుకుని
మేనువాల్చినా
ఎందుకో నిద్దుర రాదు.
టేప్ రికార్డర్ లొంచి మంద్రం గా వడపోసినట్లు
ఒకప్పటి ప్రేమ జంట, మనం .... చెట్టాపట్టాలేస్తూ
పాడుకున్న పాటల సంగీతం వినిపిస్తూ
ఆ నిన్నటి నిజం
తుడిచెయ్యలేని గతం
జ్ఞాపకం హృదయాన్ని స్పృశిస్తుంటే
నా జీవన ప్రశాంతతను నిన్నను ..... నిన్ను,
మరిచిపోలేకపోతున్నాను!?
ప్రేమకు అర్ధం తెలిపి,
బాష్యం చెప్పింది నీవే అన్న నిజాన్ని.
జీవించడానికి .... ఒక ఆశవై, ఒక నమ్మకానివై
అనిశ్చితి, అపనమ్మకం గడియల్లో ....
నిర్వీర్యుడ్నైన క్షణాల్లో ....
ధైర్యానివై,
పురోగమించేందుకు తోడుగా నిలబడ్డ నీ కోసం
కలలో ఎదురుచూడటం
సహజమే కదూ!
ఈ జీవనంలో, పూజ, గమ్యం నీవు కావడం!
మ్నిన్నటి నిజాన్ని తుడిచేయాలనేది సాద్యమా.,
ReplyDeleteఆలోచనా తరంగాలను అడ్డుకోవటమూ సాద్యమా?
జీవన ప్రశాంతతను వెతకటం సాద్యమా?......,ఇలా ఎన్నో ఎన్నెన్నో...సందేహాలు. ఇదే జీవితం.
కవిత అద్భుతంగా ఉంది సర్.
చాలా సరళమైన భావం అనిపిస్తుంది కానీ గుండెను మెలిపెడుతుంది, ఇదే మీ ప్రత్యేకత.
నిన్నటి నిజాన్ని తుడిచేయాలనేది సాద్యమా., ఆలోచనా తరంగాలను అడ్డుకోవటమూ సాద్యమా?
Deleteజీవన ప్రశాంతతను వెతకటం సాద్యమా?......,ఇలా ఎన్నో ఎన్నెన్నో...సందేహాలు. ఇదే జీవితం.
కవిత అద్భుతంగా ఉంది సర్.
చాలా సరళమైన భావం అనిపిస్తుంది కానీ గుండెను మెలిపెడుతుంది, ఇదే మీ ప్రత్యేకత.
బాగుంది ప్రశంస హృదయాన్ని హత్తుకోగలిగేలా రాయగలగడం వరమే .... వరప్రసాదిని ఎవరైనా ఆ మాట అన్నప్పుడు అది ప్రోత్సాహక వ్యాఖ్య గానే తీసుకోవడం జరుగుతుంది ....
ధన్యవాదాలు మెరాజ్ గారు! శుభోదయం!!
చిత్రకారులు చంద్రాగారి బొమ్మకి ,మిత్రులు చంద్ర గారు రాయటం ఓ ప్రత్యేకత.
ReplyDeleteచిత్రకారులు చంద్రాగారి బొమ్మకి ,
Deleteమిత్రులు చంద్ర గారు రాయటం ఓ ప్రత్యేకత.
గూగుల్ లో వెదుక్కున్నాను. దొరికింది. బొమ్మ బాగుందనిపించింది .... భావానికి దగ్గరగా ఉన్నట్లనిపించింది .... బాపు గారు సృష్టి కర్త లాంటి వారు .... అంతటి అనుభవజ్ఞుని ఊహ చుట్టూ భావాల అల్లిక చాలా కష్టం
నమస్సులు ఫాతిమా గారు!