ఏదో కావాలని,
ఎంతో చెప్పాలని ఉంటుంది
కానీ
అర్ధవంతమైన పదాలు గుర్తుకు రావు.
మనోభావనలను ఆమెకు
కనులారా చూపాలని ఉంటుంది.
క్షణం క్షణం
ఆమెతో గడిపినంతసేపూ
ఆ క్షణాలన్నీ అమూల్యమే,
కానీ
మాటలు రావు.
మనసు తత్తరపడుతుంది.
ఏమీ చెయ్యలేని స్థితి.
అతని అంచనా .....
మనఃస్థితి మాత్రం
"ఆమెకు తెలిసేలా
ప్రేమించగలుగుతున్నానా!" అనే
ఆమె, అతని మనోహరిణి
అతనికి అన్నీ .... ఇంకా ఎన్నో
అతను జీవిస్తుందే
ఆమె కోసమే అన్నంతగా.
అతని కోరిక, ఆమె చొరవ,
చేరువ .... సమర్పణాభావన
ఆ కురుల సుఘంద పరిమళాలు
పరిసరాలలో వ్యాపించి
తడబాటుకు కారణం కావాలని
ఆ మాయలో పడిపోవడంలోని
ఆనందం పొందాలని
ఎప్పుడైనా ఆమె,
ఒక్క మాట .... అంటే వినాలని
"నీతో నే ఉంటాను.
మన ప్రేమ బలపడేంత
సాన్నిహిత్యం వరమిస్తాను" అని,
....................
ప్రేమ వాగ్దానం చేసేందుకు .... సిద్దం గా,
"ప్రతి రోజూ నిన్ను ....
మరింతగా ప్రేమిస్తాను."
"నువ్వే నా ప్రాణం .... నీవే నా అన్నీ"
"నేను జీవిస్తుందే నీ కోసం!"
"నీ ముఖాన ఆ ప్రకాశం, ఆ చైతన్యం
ఆ పరిమళం, కాలాంతం వరకూ
నా సొంతం కావాలి" అనాలని.
మౌనమే సాన్నిహిత్యపు
ReplyDeleteసాహిత్యం..
అవ్యక్తీకరించే
అలౌకికత్వమే
అన్నీ అవగతమయే
ఆత్మ సంపర్కం..
బాగుంది చంద్రగారు..
మౌనం సాన్నిహిత్యపు సాహిత్యం..
Deleteఅవ్యక్తీకరించే అలౌకికత్వమే
అన్నీ అవగతమయ్యే ఆత్మ సంపర్కం..
బాగుంది చంద్రగారు..
చాలా బాగుంది విశ్లేషణాత్మక స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన!
నమస్సులు జానీ పాషా గారు! శుభోదయం!!
ప్రేమించే మనసు పడే ఆరాటాన్ని చాలా బాగా వ్యక్తం చేసారు చంద్రగారు .
ReplyDeleteప్రేమించే మనసు పడే ఆరాటాన్ని
Deleteచాలా బాగా వ్యక్తం చేసారు చంద్రగారు
చాలా బాగుంది స్పందన స్నేహ ఆత్మీయాభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ!