ఆమె అంటే నాకు, నేనంటే ఆమెకు
అంకిత భావము
దీనినేనా ప్రేమ అని అంటారు?
ప్రేమ అంటే ....
ఒకరు ఇంకొకరికి చెప్పే పదం మాత్రమా ....?
సమర్పణా భావం, బహుమానమా?
ఈ భావనకు అర్ధం ఉందా?
పరిమాణం లో ప్రేమ పెద్దదా? చిన్నదా?
ప్రేమను చూడగలిగి, నిర్వచించగలమా?
ఉదహరించి వివరించగలమా?
ప్రేమ ఒక పేరా!?
ఒక అర్ధమా!?
ఒక గుణమా!?
ఒక లక్షణమా!?
ప్రేమ అనే అనుభూతిని పొందగలిగేది
ఒక సున్నితమైన ముద్దులోనేనా?
ఒక సుకుమార మృధుస్పర్శలోనేనా?
ఎవరిని ఇంకెవరితోనూ పోల్చుకుందుకు
ఇష్టపడమో ఆ ఇష్ట భావమేనా?
నిజం గా, అనురాగ బంధం
ప్రేమ, అంటే ఏమిటో తెలుసుకుందామని ....!?
ReplyDeleteబాగుంది చంద్రగారు ప్రేమ గూర్చి ఎంత తెలుసనుకున్నా ఇంకా ఎంతో తెలియవలసినది ఉంటుందనే భావం చక్కగా తెలిపారు.
బాగుంది చంద్రగారు
Deleteప్రేమ గూర్చి ఎంత తెలుసనుకున్నా
ఇంకా ఎంతో తెలియవలసినది ఉంటుంది అనే భావం చక్కగా తెలిపారు.
చక్కని అభినందన స్నేహ ప్రోత్సాహక స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!