Saturday, April 26, 2014

వెన్నెల వేళ




ఎటుచూసినా
అందం, పరిమళం
మనోహరం గా
ఉంది
ప్రకృతి

విచారమేమో
నా మది
గోడలపై
చెరగని
సిరాలా

నీవు
తోడుగా
లేవనే
జ్ఞాపకాలు
అతుక్కుపోయి

ఇప్పుడు
నువ్వు ....
ఇంత అందం గా
మునుపెన్నడూ
లేవు.

నాకు
మళ్ళీ
ఇలాంటి సందర్బం
ఎప్పటికీ
ఎదురు కాదేమో ....

కాలం
నువ్విక్కడ 
మరి కాసేపు
ఆగేలా ఆగితే
ఎంత బాగుణ్ణో

3 comments:

  1. " కాలం
    నువ్విక్కడ
    మరి కాసేపు
    ఆగేలా ఆగితే
    ఎంత బాగుణ్ణో"
    అవును.. నాకూ అలాగే తోచింది
    కవిత ఆసాంతం ఎంతో మధురిమతో అల్లారు.
    మీ కలం నుండి ఓ విభిన్న, మృదువైన కవిత ఇది.
    చాలా బాగుంది.
    చంద్ర గారు అభినందనలు మీకు .
    *శ్రీపాద "

    ReplyDelete
    Replies
    1. "కాలమా నువ్విక్కడ మరి కాసేపు
      ఆగేలా, ఆగితే ఎంత బాగుణ్ణో"

      అవును.. నాకూ అలాగే తోచింది. కవిత ఆసాంతం ఎంతో మధురిమతో అల్లారు. మీ కలం నుండి ఓ విభిన్న, మృదువైన కవిత ఇది. చాలా బాగుంది. చంద్ర గారు అభినందనలు మీకు .

      ఎంతో బాగుంది ప్రోత్సాహకరం గా చక్కని స్నేహ ఆత్మీయ అభినందన స్పందన
      ధన్యాభివాదాలు శ్రీపాద గారు!

      Delete