సరసన నీవు లేవు అను నిరాశ నిద్దుర కోల్పోయిన .... అస్తిత్వం
పాతాళం ఊబిలో పెనుగులాట
సముద్రగర్భం లో
ఊపిరాడని ఒత్తిడి .... సరిగ్గా శ్వాస ఆడని స్థితి
ఆరాటం ఎంత పడినా, పోరాటం ఎంత చేసినా
అలవికాని
ఇప్పుడో ఎప్పుడో
ఓటమిపాలు కాక తప్పని, లొంగుబాటు సంశయము
అక్కడైనా, ఎక్కడైనా
నా మది చీకటి నైరాశ్యాన్ని చిద్రం చేయగల
ఒకే ఒక్క కాంతి కిరణం
నీవు సమీపంలో ఉన్నావనే భావన పోరాటం కొనసాగింపు
ఉపరితలం సమీపంలోనే అని
తెలిపి నంత బలం .... నీ సాన్నిహిత్యం
నిన్ను చూడబోతున్న ఆశ
శ్వాస మరింతగా బిగబట్టగలిగే పెనుగులాట
కొన్ని క్షణాలైనా నిన్ను చూడగలగడం
శ్వాస కోసం ఉపరితలం కు చేరి శ్వాసించి
పోరాడేందుకు తిరిగి సముద్రగర్భం లోకి రాగలగడమే
నీ ఆలోచనలతో సాగడం .... ఒత్తిడి ని ఎదుర్కునే నిబ్బరాన్ని పొందడమే
నీ చిరునవ్వు రూపం లీలగానైనా .... ఊహల్లో లేకపోతే
సముద్రం లోతుల్లో, శూన్యత అట్టడుగు న
ప్రాణవాయువును, నీ ప్రేమ ఆక్సీజన్ ను కోల్పోయిన
ఒంటరిని అనే భావన .... అయోమయం నీడలు నన్ను మింగెయ్యడమే
అక్కడైనా, ఎక్కడైనా
ReplyDeleteనా మది చీకటి నైరాశ్యాన్ని చిద్రం చేయగల
ఒకే ఒక్క కాంతి కిరణం
నీవు సమీపంలో ఉన్నావనే భావన పోరాటం కొనసాగింపు
పై భావాలు కోటి భావాలకు సమానం, ఎంత భావుకత ఉండో కవితలో...బెంగాలీ రచనా శైలి కనిపిస్తుంది మీ శైలిలో సర్.
అక్కడైనా, ఎక్కడైనా
Deleteనా మది చీకటి నైరాశ్యాన్ని చిద్రం చేయగల ఒకే ఒక్క కాంతి కిరణం
నీవు సమీపంలో ఉన్నావనే భావన పోరాటం కొనసాగింపు
పై భావనలు కోటి భావనలకు సమానం,
ఎంత భావుకత ఉందో కవితలో .... బెంగాలీ రచనా శైలి కనిపిస్తుంది మీ శైలిలో సర్.
చాలా గొప్ప కాంప్లిమెంట్ ఇది .... మీలాంటి సామాజిక అభ్యుదయ కవయిత్రి ద్వారా అభినందనలను పొందగలగడం అదృష్టం గా భావిస్తాను
నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు
ReplyDelete" కొన్ని క్షణాలైనా నిన్ను చూడగలగడం
శ్వాస కోసం ఉపరితలం కు చేరి శ్వాసించి
పోరాడేందుకు తిరిగి సముద్రగర్భం లోకి రాగలగడమే
నీ ఆలోచనలతో సాగడం .... ఒత్తిడి ని ఎదుర్కునే నిబ్బరాన్ని పొందడమే ! "
నిజమే మరి ...
నిరీక్షణలో ఎంత మధురిమ ఉందో మీ భావనలని మీ కవితలో చాలా బాగా అందించారు .
కవిత చదువుతున్నంత సేపూ ఎక్కడో విహరించాం కాసేపు .
చాలా బాగుంది చంద్ర గారు .
అభినందనలు .
*శ్రీపాద
"కొన్ని క్షణాలైనా నిన్ను చూడగలగడం
Deleteశ్వాస కోసం ఉపరితలం కు చేరి, శ్వాసించి పోరాడేందుకు తిరిగి సముద్రగర్భం లోకి రాగలగడమే
నీ ఆలోచనలతో సాగడం .... ఒత్తిడి ని ఎదుర్కునే నిబ్బరాన్ని పొందడమే! "
నిజమే మరి .... నిరీక్షణలో ఎంత మధురిమ ఉందో
మీ భావనలని మీ కవితలో చాలా బాగా అందించారు.
కవిత చదువుతున్నంత సేపూ ఎక్కడో విహరించాం కాసేపు .... చాలా బాగుంది చంద్ర గారు. అభినందనలు .
ఎంతో హుందాగా బాగుంది ప్రోత్సాహకరం గా మీ స్నేహాభినందన స్పందన
ధన్యమనోభివాదాలు శ్రీపాద గారు!
నర్మగర్భిత
ReplyDeleteమర్మ నిక్షిప్త
సూక్ష్మ విస్ఫోటనముంది
మత్మనో సంద్రమున
చంద్రగారు.
ప్రకటితా ప్రకటిత
ప్రకంపనలకు
మది కించిత్
ఉద్విగ్నతకు లోనైనా,
పశ్చాత్పరిణామ ప్రవృత్తితో
మీమది వికాస మొందునని
మదీయ అచంచల ఆశ్వాసము.
నర్మగర్భిత, మర్మ నిక్షిప్త సూక్ష్మ విస్ఫోటనముంది.
Deleteమత్మనో సంద్రమున
చంద్రగారు.
ప్రకటితా ప్రకటిత ప్రకంపనలకు
మది కించిత్ ఉద్విగ్నతకు లోనైనా,
పశ్చాత్పరిణామ ప్రవృత్తితో మీమది వికాస మొందునని మదీయ అచంచల ఆశ్వాసము.
బలము అతి భారమైన పదాల పదహారణాల స్పందన
స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక పరిశీలనాభినందన
ధన్యాభివాదాలు జానీ పాషా గారు! శుభోదయం!!