Saturday, November 9, 2013

అందమైన ఆవేశం, కల

ఉత్సాహభరితం గా .... 
ఆ తారలు, నక్షత్రాలు కలిసి 
ఒక అసంబద్ధ 
నిబంధ సంగీతాన్ని 
తంబుర, వీణ, శితార లతో .... 
అప్పుడు,
హిమవన్నఘాలకు ప్రాణం వచ్చి 
.............
ఆనందం, పారవశ్యం తో ప్రకృతీ, 
పారిజాతాలూ సకల పుష్పాలూ వొంగి 
పర్వతరాజుకు ప్రణమిల్లి 
ఉదయాన్నే
ఆ సూర్య కిరణ వీక్షణాలకు 
కరిగిపోయి .... ఆ కారు మబ్బులు 
వర్షించిన క్షణాలు .... ఇంకా 
నా కల, తెల్లారలేదు .... భయ పడి.

2 comments:

  1. బాగుంది మాస్టారూ,

    ReplyDelete
    Replies
    1. బాగుంది మాస్టారూ, .... స్పందన స్నేహ ప్రోత్సాహకాభినందన
      ధన్యవాదాలు ఫాతిమా జీ!

      Delete