Thursday, November 21, 2013

నీ నీడను నేను


కళ్ళు మూసుకోకు!
పోరాడాల్సిన సమయమిది.
భయపడల్సిన భూతం ....
రాక్షసుడు దాక్కున్నాడు.
ఒక రాత్తిరి గడిచి
చీకటి ఎటో పారిపోయింది.
వర్తమానం, ఆత్మబంధువునై
నేను నీ పక్కన ఉన్నాను.

జీవన సంఘర్షణల ఇష్టాలను
వెంట తెచ్చుకోకు.
వాకిట్లోనే పాదరక్షలతో పాటే
కోరికల్నీ వదిలొచ్చెయ్యి.
నిర్మలంగా, నిరాపేక్ష తో
నిద్రకు ఉపక్రమించి చూడు.
ప్రతి నిద్దుర లోనూ
ఎదురొస్తాయి. అందమైన కలలు.

నడి సంద్రం లో దూరంగా
ఈదేందుకు ప్రయత్నించేప్పుడు, 
ఆగి ఆలోచించలేవు.
నిన్ను నీవు సంరక్షించుకోగలవా అని,
అక్కడ రోదించనూ లేవు.
క్షేమంగా జీవన గమ్యం
కనుపించని తీరం
చేరుకోవాలని కోరుకోగలవే కానీ,

సమశ్యల రద్దీ అతిగా వున్న
రహదారిలో నడుస్తున్నప్పుడు,
కష్టాల్ని దాటేప్పుడు ....
ఓ స్నేహం చెయ్యందుకుని కదులు ముందుకు 
నుదుట రాత దానంత అది
జరిగిపోతుందని అలక్ష్యించకుండా,
లక్ష్య సాధనలో రాతను ....
తిరగ రాసుకునేప్పుడు నీ నీడనై నేనుంటాను.


4 comments:

  1. చాలా రోజులతర్వాత ఓ మంచి కవిత చదివాను అనిపించింది.
    అతిశయోక్తి అనుకోకపోతే... నా అభిమాన రచయిత వడ్డెర చండీదాస్ గారి శైలిని పోలిన మీ కవితలు నేను క్రమం తప్పకుండా చదువుతాను, ఈ అలవాటు ఇప్పటిది కాదు ఫేస్బుక్ లో కూడా రోజూ చదివేదాన్ని.

    ఈ కవిత చిక్కగా ఉన్న పాల సంద్రములా, అమ్మ ఇచ్చే నమ్మకములా, నిర్మల స్నేహ హస్తములా, మూగజీవులకు నీడనిచ్చే విశాల వృక్షములా.... ఇంకా.ఇంకా.. ఎంతో ఉన్నతంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. "చాలా రోజుల తర్వాత ఓ మంచి కవిత చదివాను అనిపించింది. అతిశయోక్తి అనుకోకపోతే... నా అభిమాన రచయిత వడ్డెర చండీదాస్ గారి శైలిని పోలిన మీ కవితలు నేను క్రమం తప్పకుండా చదువుతాను, ఈ అలవాటు ఇప్పటిది కాదు ఫేస్ బుక్ లో కూడా రోజూ చదివేదాన్ని.

      ఈ కవిత చిక్కగా ఉన్న పాల సంద్రం లా, అమ్మ ఇచ్చే నమ్మకం లా, నిర్మల స్నేహ హస్తం లా, మూగజీవులకు నీడనిచ్చే విశాల వృక్షం లా.... ఇంకా. ఇంకా.. ఎంతో ఉన్నతంగా ఉంది."
      ....
      స్పందన నా వరకు నాకు కాసింత అతిశయోక్తి నమ్మలేని కాంప్లిమెంటే .... ఈ సందర్భం గా వడ్డెర చండీదాస్ లాంటి మహనీయుడ్ని ఆరాధ్యుడ్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ఫాతిమా గారు. ఒక మనిషి మీద సదభిప్రాయం ఆ మనిషి భావనల్ని ఉన్నతంగా చూసేలా చేస్తుంది. అలాంటి ఒక మంచి భావన నా మీద ఉన్నందుకు ధన్యుడ్ని. మీలాంటి గొప్ప కవయిత్రుల అభినందనలు ప్రోత్సాహక వ్యాఖ్యలనుకుంటాను.
      నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!

      Delete
  2. కళ్ళు మూసుకోకు!
    పోరాడాల్సిన సమయమిది.
    భయపడల్సిన భూతం ....
    రాక్షసుడు దాక్కున్నాడు.
    ఒక రాత్తిరి గడిచి
    చీకటి ఎటో పారిపోయింది.
    వర్తమానం, ఆత్మబంధువునై
    నేను నీ పక్కన ఉన్నాను.
    chakkani bhaavaalu chaalaa baagaa manasuku hattukunetatlu cheptaru miru... pai akka maatalato nenu ekibhavistunna ....

    ReplyDelete
    Replies
    1. "కళ్ళు మూసుకోకు! పోరాడాల్సిన సమయమిది.
      భయపడల్సిన భూతం .... రాక్షసుడు దాక్కున్నాడు.
      ఒక రాత్తిరి గడిచి చీకటి ఎటో పారిపోయింది.
      వర్తమానం, ఆత్మబంధువునై నేను నీ పక్కన ఉన్నాను."

      చక్కని భావాలు చాలా బాగా మనసుకు హత్తుకునేటట్లు చెబుతారు మీరు... పై అక్క మాటలతో నెనూ ఎకీభవిస్తున్నా ....

      బావుంది స్పందన గొప్ప స్నేహాభినందన. మంజు గారు సామాజిక స్పృహతో కవితలు కథలు సంఘటనలు మీ బ్లాగు లో ఎన్నో చదివాను. మీలాంటి, మెరాజ్ గారి లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాల స్పందనలు పొందగలగడమే ఎంతో అదృష్టం గా భావిస్తాను.
      ధన్యవాదాలు మంజు గారు!

      Delete