గత కొద్ది రోజులుగా ఆకాశాన్నీ ఆ నక్షత్రాల్నీ చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. అలా చూసీ చూసీ ఏకాగ్రత ఎక్కువై కళ్ళు మసకేసి తడి జారడం లోని ఆనందానికి బానిసనయ్యానేమో అనిపిస్తుంది యెప్పుడయినా పార్కు లో ఆరుగు మించి తూలి జారిపడినప్పుడు. నా తోటి అనామక నిరాశ్రయులు నవ్వుకుంటూ అంటూ ఉంటారు, నాకు కవిత్వం పైత్యం బాగా వంట పట్టిందని.
ఆకాశం కొలనులో కదిలే చేపలు ఆ నక్షత్రాలు అని అన్నప్పుడు అందరూ నవ్వుకోవడం నాకు తెలుసు. వారి నవ్వులకు బలాన్నిస్తూ అప్పుడప్పుడూ అర్దరాత్రుల్లో నిద్రలేచి ఆకాశంలో చుక్కల్లేవని ఏడుస్తూ వుంటాను, ఏడిచే శక్తిని పూర్తిగా కోల్పోయేవరకూ. అలా అని నాకు ఆకాశమంత ఎత్తు ఎదగాలనే ఆశ లేదు. అనాధను అయినా గుండెల్లోకి తీసుకుని ఆదరిస్తున్న భూమి పుతృడ్ని అనుకోవడం లో నాకెంతో ఆనందం ఉంది.
అప్పుడప్పుడు రాత్తిరి వేళల్లో నక్షత్రాల్ని లెక్కెట్టుకుంటూ, ఫుట్ పాత్ ల మీద నేను నడుస్తున్నప్పుడు .... రక్షక బటులు నన్ను ఆపి ప్రశ్నించడం భయపెట్టడం ఏ టాంక్ బండ్ అరుగు మీదో ఆ రాత్త్రిని గడిపెయ్యడం .... జలాశయం మధ్యలో బుద్దుడి సహనాన్ని పరీక్షిస్తున్న విధ్యుత్ బల్బుల కాంతిని నక్షత్రాల కాంతితో పోల్చుకుంటూ నిద్రలోకి జారిపోతుండటం చేస్తుంటాను.
నిజం! నాలాంటి వారిని క్రమబద్దీకరించడంలో ప్రభుత్వం విఫలమైనట్లే మనం అందరమూ కొన్ని కొన్ని జీవన అత్యావశ్యకతలను అలక్ష్యం చేస్తున్నాము.
ఓ అనామక (ఇలా సంభోదించటానికి మనసొప్పదు) మహోన్నత వ్యక్తి మానసిక పరిపక్వత కలిగిన భావ వల్లరి ఇది. ఆతని అంతరంగాన ఎన్నో అలజడులు అవి వినే ఓపికా తీరికా ఎవరికుంటుంది, అర్దరాత్రి అసాంఘిక చర్యలకు అడ్డుచెప్పని ఎందరో ఇలాంటి నిరాశ్రయుల మీద మాత్రం తమ ప్రతాపం చూపిస్తుంటారు.
ReplyDeleteచాలా కాలం తరువాత మనస్సును కదిలించే ఓ సన్నివేసాన్ని అక్షర రూపం లో చూశాను,
మీ నుండి ఇలాంటి రచనలను ఆసిస్తూ... మెరాజ్
ఓ అనామక (ఇలా సంభోదించటానికి మనసొప్పదు) మహోన్నత వ్యక్తి మానసిక పరిపక్వత కలిగిన భావ వల్లరి ఇది. ఆతని అంతరంగాన ఎన్నో అలజడులు అవి వినే ఓపికా తీరికా ఎవరికుంటుంది, అర్దరాత్రి అసాంఘిక చర్యలకు అడ్డుచెప్పని ఎందరో .... ఇలాంటి నిరాశ్రయుల మీద మాత్రం తమ ప్రతాపం చూపిస్తుంటారు.
Deleteచాలా కాలం తరువాత మనస్సును కదిలించే ఓ సన్నివేసాన్ని అక్షర రూపం లో చూశాను,
మీ నుండి ఇలాంటి రచనలను ఆశిస్తూ.... మెరాజ్!
పగలల్లా శ్రమపడి వారి మానాన వారు రాత్రిళ్ళు మూడంకెలో ముడుచుకుని బ్రతుకుతున్నా వెంటాడి వేధించే వ్యవస్థతో పాటు ప్రశ్నించే మనిషి కూడా కేవలం రాళ్ళు విసిరే మనిషి మాత్రమే కారాదనే మనోభావన పర్యవసానం ఈ పోస్టింగ్. మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది. మీలాంటి సామాజిక భావుకుల కు నచ్చడం ప్రోత్సాహక స్పందనలను పొందగలగడం నా అదృష్టం అనుకుంటాను.
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!