ఆగకు, కదులు ముందుకు
పురోగమనం వైపు .... కదులు ముందుకు,
కదులు చైతన్యానివై ముందుకు ....
కుక్కలు అరుపులు వినిపించొచ్చు
గబ్బిలాలు తలమీదుగా ఎగురుతూ ఉండొచ్చు
తెలుసా నీకు? ఆ చెట్ల గుబురుల్లో
విషనాగులు నిదురిస్తుంటాయని,
ఆ ఎండిన కొమ్మలు ఒకదానితో ఒకటి రాసుకుని
అడివి అగ్నిగుండం అవుతుందని,
నాటుబాంబులు, నాటుతుపాకులు
గొడ్డళ్ళు, కొడవళ్ళ వీరంగం తో
చేతనత్వం ప్రజ్వరిల్లి,
అవినీతి, స్వార్ధ ఆక్రందనలు
భయనాదాలు వినిపిస్తాయని,
ఆగు, ఆగు .... "నేనూ వస్తాను నీతో" అంటూ,
వెనుకనుంచి పిలుపులు వినిపించొచ్చు.
అయినా ఆగకు .... కదులు ముందుకు
స్వేచ్చను శ్వాసించాలనుకుంటున్నావా!
కొనసాగించాలనుకుంటున్నావా!
అందుకే .... ఆగకు, కదులు ముందుకు.
తెలుసా నీకు? ఆ చెట్ల గుబురుల్లో
ReplyDeleteవిషనాగులు నిదురిస్తుంటాయని,
ఆ ఎండిన కొమ్మలు ఒకదానితో ఒకటి రాసుకుని
అడివి అగ్నిగుండం అవుతుందని,......
ప్రతి మనిషీ ఇలాంటి విపత్తులను ఎద్ర్కొంటూనే ముందుకు వెళ్ళాలి, అందుకు ఉత్తేజపరిచే అక్షరంకావాలి , ఆ అక్షరాలను నేడు మీ అమ్ముల పొడి నుండి తీశారనుకుంటా.
"తెలుసా నీకు? ఆ చెట్ల గుబురుల్లో విషనాగులు నిదురిస్తుంటాయని,
Deleteఆ ఎండిన కొమ్మలు ఒకదానితో ఒకటి రాసుకుని అడివి అగ్నిగుండం అవుతుందని,......"
ప్రతి మనిషీ ఇలాంటి విపత్తులను ఎదుర్కుంటూనే ముందుకు వెళ్ళాలి, అందుకు ఉత్తేజపరిచే అక్షరంకావాలి , ఆ అక్షరాలను నేడు మీ అమ్ముల పొది నుండి తీశారనుకుంటా.
పని కట్టుకుని తీసేందుకు అమ్ముల పొది అంటూ ఏమీ లేదు ఫాతిమా గారు. వృత్తిపరంగా ఎక్కువగా తిరుగుతుండటం వల్ల మార్గ మధ్యం లో ఏవో సంగటనల్ని చూస్తుండటం రాయాలనిపించి రాయడం .... అంతే! నిర్దిష్టం గా మీలా ఒక దృక్పదం ఉంటే బావుంటుందని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. అయినా నేను అనిపించింది రాసుకుని నాలో మార్పును చూసుకుని ఆనందించే వాళ్ళలో ఒకడ్ని. సుప్రభాతం మెరాజ్ ఫాతిమా గారు!
స్వేచ్చను శ్వాసించాలనుకుంటున్నావా!
ReplyDeleteకొనసాగించాలనుకుంటున్నావా!
అందుకే .... ఆగకు, కదులు ముందుకు....chala baagundi
"స్వేచ్చను శ్వాసించాలనుకుంటున్నావా! కొనసాగించాలనుకుంటున్నావా!
Deleteఅందుకే .... ఆగకు, కదులు ముందుకు...."
చాలా బాగుంది ....
ఒక పదోతరగతి మానేసిన కుర్రాడు, నేను సర్వీసెస్ అందించే ఒక ఆర్గనైజేషన్ లో .... డిప్లమా కుర్రాడి కన్నా గొప్ప స్పూర్తిని ప్రదర్శించినప్పుడు, ఆ సీనియర్ అతన్ని అణగద్రొక్కాలని చూస్తున్నా నిరుత్సాహపడకుండా తన కృషి తో హైయ్యర్ అప్స్ మెప్పు పొంది మంచి పేరు ప్రమోషను పొందడాన్ని, ముందుకు కదలడాన్ని గమనించడం జరిగింది .... చాలా సంతోషం అనిపించింది.
నా బ్లాగు కు మనస్పూర్తిగా స్వాగతిస్తూ .... నమస్సులు మెహ్దీ అలీ గారు!