Monday, November 25, 2013

మోసపూరితప్పువ్వు


అందమైన సంపెంగ పువ్వొకటి పూచి
నన్నే చూస్తూ పగలబడి నవ్వింది.
పరామర్శించింది.

ముగ్దుడ్ని అయ్యాను,
ఆ మాట, ఆ నవ్వూ వెనుక నాగుల కదలికుందని
అది ఒక మోసపూరితప్పువ్వని, విషం కక్కుతుందని తెలీక

ఒక నవ్వూ, ఒక పలుకరింపే
సాహచర్యం, జీవితం, ఇంక చాలు అనుకున్నా
ఆమె కలవక మునుపు

అంతే కానీ, ఆరంభం లోనే
నా కోరిక ఆఖరిది, తీరనిది
ఫలించనిది .... అని అనుకోలేదు.

నమ్మించి మోసగించింది.
మోసపోయాను మళ్ళీ వోసారి,
మోసపోవడం నాకు కొత్తేమీ కాదు.


(ఎప్పుడో ఏప్రిల్ లో రాసుకున్న కవిత ఇది. పోస్ట్ చెయ్యకుండా అప్పుడప్పుడూ ఎడిట్ చేస్తూ ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నాను. చివరికి ఈ రూపం లో వెలుగు చూసింది.) 

2 comments:

  1. మోసపుచ్చటములో నైపున్యత ఉన్నంతవరకూ ఇలా సాగాల్సిందే,
    పువ్వులెప్పుడూ సుకుమారముగా ఉన్నట్లు ఉంటాయి జాగ్రత్త్త సర్.

    ReplyDelete
    Replies
    1. "మోసపుచ్చటములో నైపుణ్యత ఉన్నంతవరకూ ఇలా సాగాల్సిందే .... పువ్వులెప్పుడూ సుకుమారముగా ఉన్నట్లు ఉంటాయి జాగ్రత్త సర్."

      మంచి సూచన స్పందన
      నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు. సుప్రభాతం.

      Delete