Saturday, November 23, 2013

నడివీధుల్లో


సామాజిక మనో భావనల వేడి
ఉద్యమంగా మారి,
నడి వీధి లో
నొప్పి, సాక్ష్యం నర్తిస్తూ ....
కొంగు నడుముకు బిగించి
స్త్రీలు
తమ వాదనల్ని
స్పీకర్ల గొంతుల ద్వారా
బ్రాడ్ కాష్ట్ చేస్తూ,
పురుషులు.
సెంటర్లో వీరంగం చేస్తూ,
యువకులు.
అంతటా ....
మబ్బుల వర్షం కురుస్తూ,
సంబంధం లేని పరిసర జీవాలు.

ఒకరు చెప్పక్కర్లేదు.
ఎవరైనా పసిగట్టొచ్చు.
ఆ పొగలను,
ఆ కాలిన విగత ఆలోచనల
ఆవిర్ల సెగలను,
ప్రాణముండీ ఉద్యమించలేని
ఎన్నో జీవశ్చవాల నిట్టూర్పులను,
వారి మాటల్లో
వారి ప్రతి కదలికలో
రక్తం మరిగి వినిపించే
సైరన్ లు ఏడ్పులు లో
ఉద్యమ దృడసంకల్పాన్ని
పరిసరాలలో
శ్వాస భారం అవ్వడం లో,

ఎన్నో నిరుపయోగం
వ్యర్ధాలు
ఉదాసీనత చోటుచేసుకుని
వాతావరణం లో ....
చైతన్యం లోపించి
అక్కడ,
తలలు ఆలోచించలేవు.
పిచ్చితనం ఆవేశం
నిశ్శబ్దంగా వ్యాపించి,
స్త్రీలు
ఆవేశాన్ని అక్షీకరిస్తూ,
పురుషులు
నాగళ్ళు, కత్తులు,
తుపాకులు పట్టుకుని
యువత
మార్పు వైపు అడుగులేస్తూ,
కాలం తనమానాన తను
కదులుతూనే ఉంది.
ఉద్యమం ముందుకు సాగుతూ ....

4 comments:

  1. యువత
    మార్పు వైపు అడుగులేస్తూ,
    కాలం తనమానాన తను
    కదులుతూనే ఉంది. Nice lines

    ReplyDelete
    Replies
    1. "యువత,
      మార్పు వైపు అడుగులేస్తూ,
      కాలం తనమానాన తను కదులుతూనే ఉంది. "
      నైస్ లైన్స్ .... మంచి స్పందన స్నేహాభినందన
      నమస్సులు పద్మార్పిత గారు!

      Delete
  2. వస్తుంది మీరు చెప్పిన ఆ సమయం కానీ నిర్జీవ కణాలతో..విప్లవగీతం పాడుతూ,
    మిమ్ము పొగిడే స్థాయి లేదుగానీ చాలా గొప్ప సామాజిక అవగాహన ఉంది మీ కలానికి, ఆ దారిలో ప్రయత్నిచడి అప్పుడప్పుడూ మాస్టారూ

    ReplyDelete
    Replies
    1. వస్తుంది మీరు చెప్పిన ఆ సమయం కానీ నిర్జీవ కణాలతో..విప్లవగీతం పాడుతూ, మిమ్ము పొగిడే స్థాయి లేదుగానీ చాలా గొప్ప సామాజిక అవగాహన ఉంది మీ కలానికి, ఆ దారిలో ప్రయత్నించండి అప్పుడప్పుడూ మాస్టారూ! ....
      ఒక మంచి సూచన స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!!

      Delete