Friday, November 1, 2013

మనం ఒక్కటైతే


నీవూ నేనూ 
ఈ సమాజం పట్టించుకోని 
ఒంటరి పక్షులం! 
.................
ఒంటరులం గానే కలిసుంటే? 
అటు చూడు! 
సంధ్యారాగం స్వాగతిస్తుంది. 
మరో పక్కన 
చీకటి .... 
దారిద్ర్యం ఆకలి, చాపక్రిందనీరులా 
లోకాన్ని చిక్కగా 
అలుముకునే లక్ష్యం తో 
.............
నా బాధను నీవు 
నీ బాధను నేనూ 
ఉపశమన వ్యాఖ్యలతో 
చల్లార్చుకుంటే బాగుంటుందనిపిస్తుంది.
ఆ ఆకాశం వైపు చూడు. 
ఎలా మబ్బులు కమ్ముతుందో ....
మనం ఒంటరులం అని కాబోలు. 
...............
నాకు నమ్మకం ఉంది. 
వాతావరణంలో మార్పొస్తుందని 
మన ఒంటరి 
బాధాతప్త హృదయాలు 
ఒక్కటైతే 
దౌర్భాగ్యం, దీనస్థితి 
వేడుక గా మారుతుందనిపిస్తుంది. 
ప్రకృతి తిరిగి పరవశిస్తుందనిపిస్తుంది.

2 comments:

  1. విబిన్న భావాలు ఒకే మనస్సులో ఎలా ఉంటాయో మీ కవిత చెప్తుంది.
    నిగూడమైన తోడు కూడా మన మనస్సే అనిపిస్తుంది ఒక్కోసారి , అదే భావన కలుగుతుంది మీ కవిత చదివితే.( సర్, ఇది నా అభిప్రాయం మాత్రమే)

    ReplyDelete
  2. "విబిన్న భావాలు ఒకే మనస్సులో ఎలా ఉంటాయో మీ కవిత చెప్తుంది.
    నిగూడమైన తోడు కూడా మన మనస్సే అనిపిస్తుంది ఒక్కోసారి , అదే భావన కలుగుతుంది మీ కవిత చదివితే.( సర్, ఇది నా అభిప్రాయం మాత్రమే)"
    మనలో నిద్రాణం గా ఉన్న మన మనసే మనకు తోడు .... గొప్ప విశ్లేషణ! .... గొప్ప స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
    ధన్యమనోభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete