నీవు నా కలలో రాణివి. నా మనో సామ్రాజ్ఞివి.
ఒంటరి .... వెన్నెల రాత్రుల్లో కలల రహదారుల్లో
యౌవ్వన వేళల్లో, నా ఊహల్లో వొక అద్భుత కల్పనవని
నడి రాత్తిరి నిశ్శబ్ద దిగంతాల చాయల్లో
ఎవరూ గమనించని వేళల్లో నీవూ నేనూ
ప్రేమ ఆకాశం వైపు జంటగా యెగిరే పర్వతాలమని.
మన ఊహలు, ఆశలుగా పరిణమించిన వేళ
అన్ని అడ్డంకులు, అవరోధాల్ని దాటి, .... మనం
ఆ నీలివర్ణ ఆకాశం భవితవ్యం వైపు ఎగురుతున్నట్లు
ఒకప్పుడు నేను నీతో, నీవు నాతో చేసుకున్న శపధాలు
ఎన్నెన్నో సంకల్పాలు, నీ నా జీవనాశయాలు
గుర్తు తెచ్చుకుని ఒక్కొక్కటిగా చక్కబెట్టుకుంటున్నట్లు
ఎన్నెన్నో సారహీనమైన నదీనదాల్ని సాగరాల్ని దాటి
అనంత కీకారణ్యాల .... చీకటి గుబురుల్లో
అనంతమైన ఏ లోయల్లోనో మునిగి తేలుతున్నట్లు
మన ముగింపులేని కాలం కథ, .... అందమైన కల
వేలకొద్దీ ఊహల నిట్టూర్పుల గుసగుసల సారాంశం
ఒక వెన్నెల రాత్రి ఒంటరి ప్రణయ భావన .... కలలా
కల, కలంత హాయిగా ఉంది.
ReplyDelete"కల కలంత హాయిగా ఉంది"
Deleteనచ్చిందని అభినందన స్పందన
_/\_లు ఫాతిమా గారు!