Monday, November 18, 2013

ఎప్పటిలానే మరో రోజు

పూల దుస్తుల రెపరెపలు.
గులాబీ పరిమళాల సంభాషణలు.
సగం సగం మింగేసినట్లు 
వినపడీ వినపడని 
అర్ధం అయ్యీ అవ్వని 
అవ్యక్త భావనల 
గుసగుసల సవ్వడులు.  
సముద్రపు గాలికి 
నుదుటి మీద ఆడుకుంటున్న జుట్టు. 
నా కళ్ళు ఇసుక లో కట్టుకున్న గూళ్ళను వెదుకుతూ  
ఏవో గణనసమీకరణ చర్యలు. 
నీ మనసు ను ఆకట్టుకునేలా ఏదో ఒకటి చెయ్యాలి అని,
తపన, ఆలోచన.
దూరం గా నీవే లా .... ఎవరో 
నవ్వుతూ పలుకరించా .... నీ జ్ఞాపకాన్ని 
మరో రోజు గడిచిపోయింది.

2 comments:

  1. గడచి పోతున్న కాలాన్న్ని లెక్కించే నిర్మల హృదయం,
    దూరంగా ఉన్నానే అనే భావం,
    మానసికంగా దగ్గరితనం.
    వహ..వా కవి హృదయం ఓ సముద్రం కదా...

    ReplyDelete
    Replies
    1. "గడచి పోతున్న కాలాన్న్ని లెక్కించే నిర్మల హృదయం, దూరంగా ఉన్నానే అనే భావం, మానసికంగా దగ్గరితనం.
      వహ్..వా కవి హృదయం ఓ సముద్రం కదా..."
      మీ స్పందన ప్రశంస ను వొక గొప్ప ప్రోత్సాహక అభినందనగా భావిస్తాను.
      ధన్య అభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు.

      Delete