పరిమాణం లో గుప్పెడంతే
నీ గుండె ....
కానీ,
అల్లకల్లోల సమయాల్లో,
అస్తవ్యస్తం కాని
ధైర్యం మనోబలం
నీ కళ్ళలో చూస్తున్నాను.
ఏదీ సవ్యంగా జరగక,
ఒడిదుడుకుల మయ జీవితం లో
ప్రతిదీ ప్రతికూలం అయి,
నీదీ అనుకున్న అన్నింటినీ
కాలం నీనుంచి లాక్కుని
త్యజించాల్సొచ్చి
తలొంచుకోవాల్సొచ్చిన క్షణాల్లో
నీలో ....
సానుకూలతను చూస్తున్నాను.
నీ భావనల్లో ఎనలేని
ఆ నమ్మకం
నిన్ను నీవు కోల్పోతావేమో
అనిపించిన సమయాల్లో,
నీ పాత్ర పోషణలొ
చూపించే ఉదాత్తతను,
నీ వ్యక్తిత్వాన్నీ ....
ఎంతో సరళంగా పోషిస్తుండటాన్ని ....
చూస్తూ ఉన్నాను.
ఎప్పుడూ చెదరని
ఆ చిరునవ్వు
రవ్వంతైనా సడలని
ఆ ఆత్మస్తైర్యం,
ఓ మహిళా!
నీ గుండె ధైర్యానికి జోహార్లు!
మీరు చెప్పిన ఆ మహిళకు నా నీరాజనాలు,
ReplyDeleteఇకపోతే మీరు ఆమె వ్యక్తిత్వానికి ముగ్దులయ్యారు, ఆమెలోని ఉన్నత గుణాలను మీ అక్షరాలద్వారా అందరికీ చాటిచెప్పటం మీ సుగుణం.
మీరు చెప్పిన ఆ మహిళకు నా నీరాజనాలు, ఇకపోతే మీరు ఆమె వ్యక్తిత్వానికి ముగ్దులయ్యారు. ఆమె లోని ఉన్నత గుణాలను మీ అక్షరాలద్వారా అందరికీ చాటిచెప్పటం మీ సుగుణం. ....
Deleteఒక మహిళ ఔన్నత్యాన్ని నిర్వచించడం నచ్చిందని, స్పందన లో స్నేహ ప్రోత్సాహక అభినందన.
ధన్యాభివాదాలు మెరాజ్ గారు!