నీ కళ్ళలోకి చూస్తున్నా!
నీలి తడి లో .... నీలి ఆకాసంలో మెరిసే చుక్కల్లా,
పరావర్తనం చెందుతూ ప్రకాశం
పరుచుకుంటూ కాంతి పుంజాలు,
చురుక్కున గుచ్చుకుంటూ కొంటె కిరణం.
రెచ్చగొట్టినట్లు
బలహీన క్షణాల దురదృష్టకర స్థితి
శరీరం .... నొప్పి, వేదనా మయం అయి
నిద్రించాల్సిన గడియల్లో ఒక భూకంపము లా
చెల్లాచెదురైన కలలు
కొన్ని జ్ఞాపకాల మధుర భావనలు ....
అన్నీ కలబోసినట్లు కలిసి పోయి,
అడ్రస్ లు కోల్పోయి ....
ఏదో నొప్పి తాలూకు సమస్య
అందులో కొన్ని ఒడ్డుకు చేరిన
అద్భుత అనుభవాలు అనుభూతులు ....
గుర్తుకొస్తూ,
ఒక చిత్రమైన ఉపశమనం.
కారణం .... నా ఎదురుగా .... నీవు వుండటమే!
ఎదురుగా ఎందుకు మాస్టారూ ఎదలోనే ఉంటే, అన్ని కారణాలకు కారణమైన తనని కట్టిపడేయాల్సిందే...:-)
ReplyDeleteఎదురుగా .... ఎందుకు మాష్టారూ ఎదలోనే ఉంటే, అన్ని కారణాలకు కారణమైన ఆ పిల్లని కట్టిపడేయండి .... స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
ReplyDeleteఆ అద్భుతాన్ని ఆనందించాలే కాని అనుభూతించాలనుకోకూడదు. ముచ్చట వేరు ముసరటం వేరు .... ధన్యమనోభివాదాలు ఫాతిమా గారు!