నేస్తమా!
ఏ కట్టుబాట్ల తాళ్ళతోనూ కట్టెయ్యను నిన్ను.
ఏ హక్కూ నీ పై ఉందని అనుకోను.
ఏ సెంటిమెంట్ తోనూ చుట్టూ దడి కట్టలేను.
ప్రియతమా! ఒకనిజం చెప్పనా!
నాకు నీ స్నేహం, నీ ప్రేమ కావాలి,
నీ ఆత్మీయ, అనురాగ భావనల
ప్రవాహం లో కొట్టుకుపోవాలి నేను.
గుక్కెడు దాహం తీర్చుకుందుకు,
ఎంతో ఉన్నతము, ఎంతో స్వచ్చము అయిన
నీ ఆలోచనల ఆవేశంలోంచి జారే ఊట
ఆ మెరుపు భావనల నీటి దారలు తాగాలి.
ప్రియనేస్తమా! నీవంటే నాకు ఎంతో ఇష్టం!
ఎందుకో తెలియదు. నిన్ను ప్రేమిస్తున్నానా,
బంగారంలాంటి మెరుపేదో నీలో చూస్తున్నానా అని
నా దాహం నా ఆబ తీరుతుందని ఆశతో!
నీ ప్రేమ, నీ అభిమానం, బంగారం లాంటి
నీ మనోవికాసం .... ప్రతిగా పొందాలని కాదు.
నీ కంటిలో, ఆ నమ్మకం ఆ మెరుపు
ప్రకాశాన్ని దోచుకోవాలని కూడా కాదు.
కేవలం
నీ సాన్నిహిత్యం లో, నీ ప్రేమ నీడలో,
నీ స్నేహ ఆత్మీయ .... ప్రేమామృతం ను
నైవేద్యం లా పొందలేకపోతానా .... ఎప్పుడైనా అనే,
ఓ ఆరాధ్యభావమా!
నీ అనుబంధమే నా అస్తి, నా ఐశ్వర్యం ....
నీవే నా సూర్యోదయం, నా సూర్యాస్తమం ....
నీవే నాలో వెచ్చదనం నా వసంతం.
ఈ జీవన దాహం
నాలో ఘాడంగా పేరుకుపోయి
ఏదో అర్ధం కాని ప్రేమ .... ఎంత తాగినా తీరని ఆబ
ఆ భావ దాహం తీర్చుకునేందుకే జీవిస్తున్నానేమో అని.
ఆ ఆత్మీయభావనే మనస్సులను కట్టిపడేస్తుంది. ఈ కవితలో ఎనలేని భావాలు ముత్యాలమూటలై దొర్లుతున్నాయి
ReplyDeleteఆ ఆత్మీయభావనే మనస్సులను కట్టిపడేస్తుంది. ఈ కవితలో ఎనలేని భావాలు ముత్యాలమూటలై దొర్లుతున్నాయి
ReplyDeleteస్నేహానికి తగినంత గౌరవప్రధమైన నిర్వచనం ఇవ్వలేకపోయానేమో అని మనసు తెగ మదన పడుతుంది .... ఈ స్పందన తో ఇప్పుడు ఆ భారం తగ్గింది .... నమస్సులు ఫాతిమా గారు.
ReplyDelete