Tuesday, September 24, 2013

జీవించని జీవితం

భగ భగమని రగిలిన మంటలు ఆగి, బూడిద చల్లారి, 
లూబ్రికేషన్ లేని కాల చక్రం ఇరుసు కీచుమంటూ ....
అలుముకున్న పొగ, ఆ పరిసరాల్లో పలుచనయ్యి, అక్కడే .... 
అక్షర సత్యం లా, ఒక అనుభవం .... ఒక అర్ధం పక్కనే ఉంటుంది.

సాహసంతో కూడిన నిర్ణయం .... జీవితంలో ఒంటరిని చేసి   
నిశ్శబ్దం చుట్టుముట్టి, ఉక్కిరిబిక్కిరి అయి, కాల సాహచర్యం లో  
కుదుటబడ్డ .... సామాన్య వాతావరణం లో .... ఊహించని రీతిలో
మంచి తనం, నిజం అబద్దం బంధ సారాంశం చరిత్ర పుట లా ముందుంటుంది.

తొందర, వేగం లో నియంత్రణ కష్టం. నెమ్మది నెమ్మదిగా 
జాగ్రత్తగా జీవితం పేజీలు తిప్పక తప్పదు.
బోల్డ్ అక్షరాల్లో ఎదుగుదల అనో, పురోగమనం అనో ఎక్కడో రాసుంటుంది. 
చదవాలి. ముందుకు కదిలేందుకు, టోల్ గేట్ లో మూల్యం చెల్లించాలి.

జీవితం అంతా ఈ అనుభవాల అంతర్యుద్ధాల మయమే    
ఆశలు, నిర్ణయాలు, పట్టుదలలు .... అవహేళనలుగా పరిణామం చెంది 
ఆ ఒంటరి రహదారి లో .... ఎన్ని అరుపులు, ఎన్ని అవహేళనలో 
జీవించని ఆశల నిట్టూర్పులో .... నిండుగా జీవించాలనే తపనలో ....

2 comments:

  1. మాస్టారూ, జీవితం కొందరికి శాపం అవుతుంది.
    జీవిత పయనమ్లో యెడారి దారులూ, తిమిర మార్గాలూ ఎదురవుతాయి.
    వాటిని అదిగమించవచ్హు, కానీ గులాబీ దారిలా కనిపిస్తూ ముళ్ళను గుచ్హుతాయి,
    మయసభ వంటి ఈ జీవితాన్ని అడుగడుగునా ఎత్తుల పైఎత్తులతో అదిగమించటానికి చాలా తెలివి (ల్్ క్యం ) కావాలి.మీ కవిత కాదేమో నా వంటి వారికి అది శుభాషితం.

    ReplyDelete
  2. మాస్టారూ, జీవితం కొందరికి శాపం .... ఆ పయనం లో ఎడారి దారులూ, తిమిర మార్గాలే అన్నీ .... పళ్ళబిగువున వాటిని అదిగమించవచ్చు, కానీ గులాబీ దారిలా కనిపిస్తూ ముళ్ళను గుచ్చుతాయి. మయసభ వంటి ఈ జీవితాన్ని జీవించడానికి, అడుగడుగునా ఎత్తులను పైఎత్తులతో అదిగమించటానికి చాలా తెలివి(లౌక్యం )కావాలి. బహుశ ఇది మీ కవిత కాదేమో .... నా వంటి వారికి శుభాషితమేమో అనిపిస్తుంది.

    కొన్ని స్పందనలు మనస్సులోంచి వస్తాయి. కొన్నిస్పందనలు ప్రోత్సహించడానికే వస్తాయి. గొప్ప స్పందనలు భావుకుని మనోభావనల్ని ప్రభావితం చేస్తాయి. నన్నెంతగానో ప్రభావితం చేసిన స్పందన మీది ఫాతిమా గారు. మీకు ధన్యమనోభివాదాలు.

    ReplyDelete