నీవు అనుకుంటే ఏమైనా చెయ్యగలవు.
నా ప్రపంచాన్ని చిద్రం చెయ్యగలవు.
నాకొక కొత్త ఆరంభం ఆనందం పంచనూ గలవు.
ఎంత చిత్రమో
అన్నీ క్రిందికీ పైకీ అవుతూ
దొరకని కనబడని దేనికోసమో
తెలిసీ వెతుక్కుంటూ పోరాడుతుండటం.
.....
నీ కళ్ళలోకి చూస్తే నిజమేమైనా
తెలుస్తుందేమో .... నీవు నాతోనే ఎప్పటికీ అని
ఏదో అనుమానం పీడ ....
ఇప్పటికే నిన్ను కోల్పోయానేమో అని.
ఈ గాలి ఈ వాతావరణం లో
ఏదో లోపం ఉంది.
నేను నిమిత్త మాత్రుడ్ని! ఒక ప్రేక్షకుడ్ని!
నేను తెల్సుకోవాలనుకుంటున్న .... కోరిక
నీ మనసు లో రూపం నేనా కాదా అనే
నేను చెవిటి, మూగ, గుడ్డి....వాడ్ని గా
నన్ను నేను భావించి బాధపడలేకపోతున్నా.
"నీవు అనుకుంటే ఏమైనా చెయ్యగలవు.
ReplyDeleteనా ప్రపంచాన్ని చిద్రం చెయ్యగలవు.
నాకొక కొత్త ఆరంభం ఆనందం పంచనూ గలవు" . ..ఈ నమ్మకాన్నిచ్హిన మీ నేస్తం మీ బాదని తీసివేయలేదా? సర్, మీ కవితలు భావామృతాన్ని కురిపిస్తున్నాయి.
మీ కవిత భావామృతం కురుస్తుంది .... గొప్ప కాంప్లిమెంట్!
ReplyDeleteనమ్మకాన్నిచ్చిన నేస్తం బాధని తీసివేయలేదా? ....
నిజమే కదా! ఏ సమస్య పరిష్కారమైనా సంప్రదింపుల్తో సాధ్యమే కదా! మంచి మాట సెలవిచ్చారు.
ఫాతిమా గారు మీకు ధన్యాభివాదాలు.