ఏ పదాలు, మాటల్లో వర్ణించ లేని
భౌతిక స్వాధీనత అవసరం లేని
అనిర్వచనం అది
ఒకే చోట కలిసి ఉంటూ
ఒకే ఆశతో ఒక్కరిలా
ఒకే కలను కలిసి కంటూ
వ్యక్తులు ఇద్దరయినా
మనసు ఒక్కటే అయి
ఒకే ఆత్మ ఒకే గుండె కావడం
చేతిలో చెయ్యేసుకుని
మరణం, శాశ్వతత్వం అంచు వరకూ
ఎప్పటికీ నమ్ముకుని జీవించడం
అదే .... ప్రేమ!
వ్యక్తులు ఇద్దరయినా
ReplyDeleteమనసు ఒక్కటే అయి
ఒకే ఆత్మ ఒకే గుండె కావడం
feel చాలా బాగుంది ...
కాకపోతే నాకు అనిపించినా కొన్ని భావాలు .... ఇలా ...
వ్యక్తులు ఇద్దరయినా
వ్యక్తిత్వం ఒక్కటే అయి
ఒకే ఆత్మకి రెండు గుండెలుగా
గుండె బౌతికము కనుక ఒక్కటే అనే కంటే దానిని రెండుగా ఉంచడం బాగుంటుందేమో...
kudos......
"వ్యక్తులు ఇద్దరయినా
ReplyDeleteమనసు ఒక్కటే అయి
ఒకే ఆత్మ ఒకే గుండె కావడం"
ఫీల్ చాలా బాగుంది .... కాకపోతే నాకు అనిపించినా కొన్ని భావాలు .... ఇలా ...
వ్యక్తులు ఇద్దరయినా
వ్యక్తిత్వం ఒక్కటే అయి
ఒకే ఆత్మకి రెండు గుండెలుగా
గుండె బౌతికము కనుక ఒక్కటే అనే కంటే దానిని రెండుగా ఉంచడం బాగుంటుందేమో...
కుడోస్ .... స్పందన ద్వారా మంచి సూచన వాడుకలో హృదయం లో హృదయం మమైకం అనడాన్ని అలా రాయడం జరిగింది. మీ సూచన గౌరవించదగినది.
ధన్యాభివాదాలు సాగర్ జీ!