Sunday, June 1, 2014

తెలుసా!? .... ఈ మౌనం అర్ధం నీకు




ఓ పిల్లా!?
ఎవరికి తెలుసు?
నాలో ఈ శూన్యం నిశ్శబ్దం
నిన్ను చూసిన ప్రతిసారీ ....
ఎన్ని భావనలు
ఎన్ని వింత వింత కోరికలు
ఆశ్చర్యమేస్తుంది
నీవు గమనించావో లేదో
నీవు నావైపు చూసిన ప్రతిసారీ
నేను పక్కకు చూస్తున్నాను.
నీకు తెలియరాదనే
నీ, నా కలయిక సంపూర్ణతత్వమని
నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుందని

పిల్లా! నీవెరుగవు
ఈ మది భావనలు
నీవు లేని జీవితం జీవించలేనని
ఎంత శూన్యమో
ఎంత భారమో తెలుసా?
క్షణం క్షణం నిన్నే తలస్తూ
నీకై తపించే సమర్పణాభావం
నా హృదయం,
నా ఆత్మ నిన్నే జపిస్తూ
అవకాశం వస్తే
సర్వం త్యజించేందుకు
వొదులుకుందుకు సిద్దం గా
ఇప్పుడు,
నాకు నీ సాహచర్యం
అవసరం ఎంతో నీకు తెలుసా?




కోరికల ఆశల గమ్యాన్నీ 
జీవితం లో
ఆశించిన అన్నీ నీలో చూసాను.
ఓ పిల్లా!
ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు.
అయినా,
నీతో చెప్పలేను.
అడుగుముందుకు వెయ్యలేను.
పరిణామం
నిద్దుర రాదు.
ఒంటరి రాత్రులే అన్నీ
భయం
కళ్ళను మూసేందుకు
మరో కలను,
నిన్ను కనేందుకు
నిజం పిల్లా!
అంతరంగం అంతా అలజడిమయం

నిన్ను నాలోనే దాచుకుంటాను.
పొదువుకుంటాను.
ఈ రాత్తిరంతా
నీ పక్కనే, నీ తోనే ఉంటాను.
ఓ పిల్లా!
ఈ ప్రపంచాన్ని నా ప్రపంచాన్ని అంతా
నీ ముందు పరిచేస్తున్నాను.
నీ ప్రేమ పారవశ్యం నాదే కావాలని
కానీ,
పిల్లా! నిజంగా నేను
నీతో మనసువిప్పి మాట్లాడుతున్నానా?
లేక,
మరో కల కంటున్నానా?
పిల్లా! ఈ హృదయమంతా నీవై ఉండి
నిండిపోయావని నీకు తెలుసా?

No comments:

Post a Comment