వెళ్ళిపోతున్నా నీకు దూరంగా .... మార్గాన్ని అన్వేషిస్తూ,
స్వయం ఉపాది ని,
ఆర్ధిక స్వాతంత్రత సౌలభ్యతను పొందేందుకు
సమయం మించిపోకమునుపే
గమ్యం సమీపం లోనే ఉంది అని ....
నీ నయనాల్లో స్పష్టంగా చూస్తున్నాను.
నీ ప్రేమను, నీ కన్నీళ్ళను
నేను వెళుతున్నానే .... కానీ,
అక్కడ నేను ఒంటరిని .... నీవు లేకుండా
జీవితం లో అనుక్షణమూ .... అవసరమే
నీ ప్రేమ, నీ సాహచర్యము.
నన్ను నమ్ము! నా హృదయం నీ చెంతే ఉంది.
నేను మాత్రం ....
నిన్నూ, నా హృదయాన్ని కోల్పోయి దూరంగా ....
నీకు తెలుసు అది నీవే అని
ఎప్పుడైనా ....
నేను అలసిపోయి
మోయలేని భారం మోస్తున్నాననిపించి,
ఓటమిని అంగీకరించబోతుంటానో ....
నీకు తెలుసు
అప్పుడు, అక్కడ నీ అవసరము
అనునయము తోడు కోరుకుంటానని
నాకు అవసరమైన బలం, ధైర్యాన్ని పొందేందుకు
నన్ను నమ్ము పిల్లా!
నిజమే చెబుతున్నాను.
నీ పట్ల .... ఎంతో ఘాడమైన ప్రేమ నాదని,
ఓ పిల్లా! మరోసారి మనవిచేసుకుంటున్నా
వెళ్ళిపోతున్నానని
ఏదోలా ఒక చిరునవ్వును పొందాలనుంది
వెళ్ళేలోగా .... నీనుంచి
ఎన్నో జ్ఞాపకాల మన కలయికలను
మరచిపోయే ప్రయత్నం చేస్తా .... కొంత కాలం పాటైనా
అప్పటివరకూ,
ఒంటరినే నేను, నీవు లేక .... అక్కడ
అయినా నా ప్రతి కదలిక నీడగా నీవుండాలని ....
నా ఆశ ....
నా హృదయాన్ని నీ వద్దే వదిలేసి
నేను, నీకూ నా హృదయానికీ దూరమౌతున్నాను.
వెళ్ళిపోతున్నాను.
నీ కోసం, నీ ప్రేమ కోసం, మన రేపటి సౌలభ్యం కోసం
నేను, నీకూ నా హృదయానికీ దూరమౌతున్నాను. వెళ్ళిపోతున్నాను.
ReplyDeleteనీ కోసం, నీ ప్రేమ కోసం, మన రేపటి సౌలభ్యం కోసం......
ఓ మంచి బాధ్యాతాయుతమైన నిర్ణయం . బాగుంది చంద్రగారు.
నేను, నీకూ నా హృదయానికీ దూరమౌతున్నాను. వెళ్ళిపోతున్నాను.
Deleteనీ కోసం, నీ ప్రేమ కోసం, మన రేపటి సౌలభ్యం కోసం......
ఓ మంచి బాధ్యాతాయుతమైన నిర్ణయం .
బాగుంది చంద్రగారు.
బాగుంది స్పందన స్నేహాభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!
బ్లాగ్ వేదిక మరిన్ని వినూత్నమైన ఫీచర్స్ తో తయారుకానుంది.త్వరలో సొంత డొమైన్ కూడాపొంది వెబ్సైట్ గా రానుంది.మీరు కూడా బ్లాగ్ వేదిక మెంబర్ అయ్యినందుకు చాలా సంతోషిస్తున్నాము.బ్లాగ్ వేదిక యొక్క సభ్యులను బ్లాగర్ ప్రపంచానికి దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో వారి పరిచయాలను బ్లాగ్ వేదిక ద్వారా అందించాలని సంకల్పించాము.దయచేసి మీరు మీ పరచయాన్ని,మీ బ్లాగ్ యొక్క ఉద్దేశ్యాన్ని,మీ బ్లాగ్ అనుభవాలను,మీ ఫొటొలను [మీకిష్టమైతేనే],ఇంకా ఏముంటే అవి,క్రింది మెయిల్ ఐడికి పంపించగలరు.
ReplyDeletemd.ahmedchowdary@gmail.com
www.blogvedika.blogspot.in
వీలు చూసుకుని పంపించగలను. ధన్యవాదాలు అహ్మద్ చౌదరి గారు! శుభోదయం!!
Deleteచాలా భారమైన పదజాలం.
ReplyDeleteగుండెను కదిలించింది కూడానూ
" మోయలేని భారం మోస్తున్నాననిపించి,
ఓటమిని అంగీకరించబోతుంటానో .... "
multi focused personality మీరు
మంచి భావాలను అందించి నందుకు ...
ధన్యవాదాలండీ చంద్ర గారు మీకు.
*శ్రీపాద
చాలా భారమైన పదజాలం. గుండెను కదిలించింది కూడానూ
Delete" మోయలేని భారం మోస్తున్నాననిపించి, ఓటమిని అంగీకరించబోతుంటానో .... "
మల్టీ ఫోకస్డ్ పర్సనాలిటీ మీరు మంచి భావాలను అందించి నందుకు ...
ధన్యవాదాలండీ చంద్ర గారు మీకు.
చక్కని స్పందన స్నేహాభినందన
ధన్యాభివాదాలు *శ్రీపాద గారు! శుభ ఉషోదయం!!