ఇక్కడ.
ఇప్పుడు ఈ పర్వతాల నీడలో
నన్ను నేను దాచుకుని
నిశ్శబ్దం లో స్నానం చేసి
ప్రశాంతత లో సేదదీరి
స్వయాన్ని
శుభ్ర పరచుకుంటున్నాను.
ఇక్కడ.
ఇప్పుడు ఏ ప్రాచీన కాలపు
బుద్ధిమత్వం
వివేకం మందమారుతాలై
మెల్లగా
స్పర్శించడం లేదు.
ఏ ఆత్మల శరీరాలను,
ఇక్కడ, ఇప్పుడు
అప్పుడే ఆరంభమై మరు క్షణం లోనే
అదృశ్యమయ్యే
ఏ సాధన కు సాధ్యం కాని
ఎన్నో
ఉచిత సలాహాల
విస్తరెయ్యని వడ్డింపులు ....
కొనసాగని ఆ కృత్రిమత్వం
ప్రేమ, కోల్పోయేందుకే అన్నరీతి లో ....
నటన లా పరిణమించి
నిజం! నిజంగానే
నిన్ను కలుస్తూనే తొలి పాటంలో ....
నేను అర్ధం చేసుకుంది ఇదే ప్రియా!
ఉచిత సలాహాల
ReplyDeleteవిస్తరెయ్యని వడ్డింపులు ఎన్నో .... ఎంత కచ్చితమైన భావమో...
Deleteఉచిత సలాహాల
విస్తరెయ్యని వడ్డింపులు ఎన్నో .... ఎంత కచ్చితమైన భావమో...
బాగుంది కదూ! ఇది ఒక సీనియర్ కవయిత్రి మెరాజ్ గారి స్టైల్ పదబంధం
మెచ్చినందుకు _/\_లు ఫాతిమా గారు