నా స్నేహం కోసం తపిస్తూ, ప్రయత్నిస్తూ
ప్రతి అవకాశంలో నన్ను కలవడానికి వీలు చూసుకుని
హృదయద్వారాలు తెరిచి మరీ, అంతరంగం సుముఖతను
మనసారా తన రెండు చేతులు బార్లా చాచి
మనోభావనల ప్రేమ ను తెలిపి స్వాగతిస్తున్న .... ఓ చెలీ
నీకు గుర్తుందనుకోను. నిజంగా గుర్తుందో లేదో నాకు గుర్తుంది.
ఆనాడు, నేను నీముందు చేతులుకట్టుకుని నిలబడ్డ రోజు ముద్దాయిలా
ప్రేమికుడిగా దారుణం గా భంగపడిన రోజు ....
బహుశ, ఇప్పుడు నేను దూరం గా వెళ్ళిపోవడం
ఆ గతాన్ని గుర్తుకు తెస్తుందో లేదో .... బాధను కలిగిస్తుందని తెలుసు
ఇప్పుడు నీవు, నామీద ఎందుకు ఒత్తిడి పెంచడం లేదో .... తెలియకపోయినా
అంతమాత్రానే నీ పట్టు వదులుతావనీ అనుకోను ....
తొందరపడకుండా వేచి చూస్తావనే అనిపిస్తుంది
నాడు నేను చూపిన అసహనం అనుభవం
నీ కళ్ళ ముందు కదులాడుతూనే ఉండి ఉంటుందని తెలుసు కనుక.
నా ఊహలు, ఆలోచనలకు అందని విధం గా
నేను ఆశ్చర్యపడేలా
ఇప్పుడు నీవు నా పక్కపక్కనే తిరుగుతూ ఉన్నావు.
నేను నీ అసహనం, తొందరపాటు నిర్ణయం కోసం
ఉక్రోషంతో ఎదురుచూస్తూ ఉంటానని .... తెలిసీ
నీ కదలికలు, నీ నిశ్చల నిరాడంభరత
ఆ నిశ్శబ్దం శబ్దాన్ని వింటుంటేనే అర్ధం అవుతుంది.
అంతే కాదు అనాలోచితం గా ఎవరైనా
నిన్ను అస్థిరపరిచినా, రెచ్చగొట్టినా మారే మనస్తత్వం నీదని
ఎదురుచూస్తూ, నేననుకుంటానని ఊహిస్తూ ప్రవర్తిస్తున్నావు.
నీ నిలకడతనం, తాపసితనం నన్ను ఆకట్టుకుని, తగ్గక పోగా
నీ పట్ల గౌరవం పెరుగుతుంది.
నిజంగా .... నా మనస్సే అస్థిరపడి
నీడ, తోడు అవసరం అనిపిస్తూ నిర్ణయించుకోవాలనిపిస్తుంది.
ఇప్పుడే గమనిస్తున్నాను. నీలో ఒక వింత అద్భుత సాహచర్యాన్ని
ఇన్నాళ్ళూ, నేను నిన్ను భిన్నంగా చూసి
ఒక అవివేకిని లా ప్రవర్తించినా
నా ఆనందం ఉల్లాసం సుఖమయ జీవితం కోసం
తపిస్తున్న నిన్ను నా భాగస్వామిని గా పొందడం లో
ఎన్ని పూజల ఫలం ఉందో కదా అనిపిస్తుంది .... ప్రియా!
నీ నిలకడతనం, తాపసితనం నన్ను ఆకట్టుకుని, తగ్గక పోగా
ReplyDeleteనీ పట్ల గౌరవం పెరుగుతుంది.
పైన ఉదహరించిన మెత్తటి మనస్తత్వాన్ని అంతే మెత్తటి మందలింపునీ చూస్తుంటే..., మళ్ళీ బెంగాలీ సాహిత్యం చదువుతున్నానేమో అనిపిస్తుంది.
సున్నిత హృఉదయాన్ని తాకే అద్భుత , రచనా ప్రక్రియ మీ సొంతం అతిశయోక్తి కాదు సర్,
నీ నిలకడతనం, తాపసితనం నన్ను ఆకట్టుకుని, తగ్గక పోగా
Deleteనీ పట్ల గౌరవం పెరుగుతుంది.
పైన ఉదహరించిన మెత్తటి మనస్తత్వాన్ని అంతే మెత్తటి మందలింపునీ చూస్తుంటే..., మళ్ళీ బెంగాలీ సాహిత్యం చదువుతున్నానేమో అనిపిస్తుంది.
సున్నిత హృఉదయాన్ని తాకే అద్భుత , రచనా ప్రక్రియ మీ సొంతం అతిశయోక్తి కాదు సర్,
మీ విశ్లేషణలో ఎప్పటిలానే గొప్ప ప్రోత్సాహము ప్రాణమూ ఉన్నాయి. నా లాంటి ఎందరికో ప్రేరణ నిస్తూ. ఎవరిపైనైనా మంచి అబిప్రాయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి భావనలపై ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడుతుందనడానికి మీ స్పందన ఒక ఉదాహరణ. నాది ఒక నివేదన లాంటి వచన ప్రక్రియ. మీకు నచ్చినందుకు మనోభివాదాలు మెరాజ్ గారు. శుభోదయం!!
సున్నిత మయానా మనసు గురించ్చి బాగా చెప్పారు
ReplyDeleteసున్నితమైన మనస్సు గురించి బాగా చెప్పారు.
Deleteచాలా బాగుంది మీ స్పందన స్నేహాభినందన
ధన్యాభివాదాలు కలిగొట్ల వెంకట రత్న శర్మ గారు! శుభ ఉషోదయం!!