Saturday, June 7, 2014

నా జీవితంలోకి వచ్చి చూడు .... ఒక్కసారి




ఎన్ని ఆశలు, ఆశయాలు .... సంగతులో జీవితం లో
అన్నీ కావాలని, పొందాలనుంటుంది.
ప్రతిదీ సాదించాలనుంటుంది .... దీర్ఘ దర్శులం కాకుండానే.
ఒక బీదవాడు ధనవంతుడు కాగలగడం
కాగితం పై కథ అనే నిరూపించబడింది. మినహా,
అన్ని పధకాలు అన్ని ప్రణాళికలు
ధనవంతుడ్ని మరింత ధనవంతుడ్ని చేసాయే కానీ,
ఏ ప్రణాళిక సామాన్యుడ్ని అసామాన్యుడ్ని చెయ్యలేదు.
అందుకో, ఎవరో ఏదో చేస్తారనే ఆశను కోల్పోయాను.
నా గమ్యం నీవుగా, నా ఆశలన్నీ నీమీదే పెట్టుకున్నాను.

ఓ పిల్లా! ఓక్కసారి .... కేవలం ఒకే ఒక్కసారి నా మాట విను.
నేను పొందాలనుకున్నది పొందడం లో నాతో సహకరించు.
పిల్లా! నిన్ను నమ్మాను. నీవూ నన్ను నమ్ము ....
ఎగతాళిగా తీసుకోకు
కేవలం, ఒక్కసారి నీ తోడును పొందనీ
నా శోధన లో నేను గమనించిన .... ఒకే ఒక్క ప్రేరణ,
అమూల్య సంపద, మంచితనానివి నీవు.
అవిశ్వసించకు, తిరస్కరించకు నన్ను .... ఆలోచించి,
నాకో మాటియ్యి .... సహచరిస్తానని, నాతోనే ఉంటానని 




అర నిద్రలో లేచి ఎదుర్కోలేను. మరో ఉదయాన్ని
నిజం గా .... ఇక్కడ, నా పక్కన నీవు లేకపోతే
నన్నొదిలి కావాలనే దూరంగా వెళ్ళిపోతే .... నీవు.
నేనో మానునో మాకునో లానే మిగిలిపోతాను.
అభిమానం అస్తిత్వం అన్నీ కోల్పోయిన జీవితంతో,
పిల్లా1 .... కేవలం ఒక చిన్న కలే నాదనుకుంటే ....
ఆ కలను నిజం చేసి చూసుకోవాలనుకోవదం లో ....
ఒకే ఒక్క అవకాశం యివ్వవా!? .... నేను గెలవడానికి
నీ విషయం లో కూడా ఓటమిని పొంది జీవించలేను.

కావడి కుండలు, కలిమి, నిధి దొరకడం
అనుకుని చెప్పుకున్నంత సులభం అనుకోలేను.
ఒక్క కష్టం సేద్యం స్వేదం తోనే అది సాధ్యం
పిల్లా! నీవు నాకు అండగా తోడుగా నిలబడితే
నన్ను నేను, నీకు కోల్పోవడానికి .... సిద్దం గా ఉన్నాను.
ప్రపంచాన్ని చుట్టేసి ఇచ్చేస్తానని …. చెప్పను,  కథ
నేను నీకోసం అహరినిశలు కష్టపడతానని మాటిస్తాను .... కష్టమెంతైనా
ప్రతి రోజూ .... పిల్లా! నీవు నన్ను వొదిలెళ్ళనంతవరకూ ....
ఇప్పుడైనా చెప్పవా పిల్లా! .... నాతోనే ఉంటానని
నన్ను గా సమర్పించుకున్న నాతో సహజీవనం సాగిస్తానని.

2 comments:

  1. Nice Post, Plz read my stories @ http://sadikaamar.blogspot.in/ , if you like it please share in your circle.

    ReplyDelete
    Replies
    1. సాదిక గారు స్వాగతం నా బ్లాగుకు
      బాగుంది స్పందన
      ధన్యవాదాలు సాదిక జీ! శుభోదయం!!

      Delete