Wednesday, June 11, 2014

తుమ్ముతోనే వచ్చింది తంటా .... హతవిధీ!




ఎవరో ప్రశ్నించినట్లు అశరీరవాణి పలుకులు.

ఔనూ!
నీవు రాస్తున్నావే .... నీ కావ్య నాయకి
ఆమె వద్ద ఏముందని ప్రేమలో పడ్డావు?
హృదయం దొంగిలించడం అంత తేలికా?

కవి ఉలిక్కిపడ్డాడు.
క్షణం ఆలోచించాడు. .... చెప్పసాగాడు.

తొలిసారి
నాకు ఎదురుపడినప్పుడు తుమ్మొచ్చింది ఆమెకు.
క్షమించండి! అంటూ
తన రెండు చేతులతో ముఖాన్ని దాచేసేసుకుంది ఆమె.

నాకు తెలిసినంత వరకూ
చాలా మంది
ఒక చేతినో, చేతి రుమాలు నో వాడటమే తెలుసు.
తల పక్కకు తిప్పుకుని తమ చేతి లో తుమ్మడమో,
నోరు మూసేసుకోవడమో కూడా తెలుసు.




ఆమె మాత్రం
తన ముఖాన్ని రెండు చేతులతో మూసేసుకోవడం
చిత్రంగా అనిపించింది.

ఆ క్షణం లో
చిన్నపిల్లలతో దొంగ, బూచి ఆట ఆడుతున్న దాని లా
ఆమె, ఆమె అందం, ఆ అపురూప అద్భుత లావణ్యం లను ....
ఆ రెండు చేతుల్లో దాచేసుకుంటున్నట్లు ....
ఆ రోజు ....

ఆ అనుభూతి ఆ అబద్రతా భావన ను చూడాలని
అవకాశం కోసం
ప్రతి రోజూ అప్పట్నుంచి ఎదురుచూస్తూ
భంగపడుతూనే ఉన్నాను.

ఆ క్షణమే ఆమెకు
నా హృదయాన్ని సమర్పించుకున్నాను.
ఆమెను తప్ప వేరెవర్నీ నేను ప్రేమించరాదని నిర్ణయించుకున్నాకే
ఆమె నా కవ్య నాయకి అయ్యింది .... అంటూ,

4 comments:

  1. నా బాధ నాది..
    నా బుగ్గపై అసహ్యంగా వున్న నల్లని మచ్చని కప్పుకున్నాను..
    అర్ధం చేసుకోవూ..
    -మీ కావ్య నాయకి అంతరంగం..
    సరదాగా..లైట్ తీస్కోండి..

    ReplyDelete
    Replies
    1. నా బాధ నాది....
      నా బుగ్గపై అసహ్యంగా వున్న నల్లని మచ్చని కప్పుకున్నాను....
      అర్ధం చేసుకోవూ....

      -మీ కావ్య నాయకి అంతరంగం....

      సరదాగా..లైట్ తీస్కోండి....

      ముందుగా ఓలేటి గారికి హృదయపుర్వక స్వాగతం .... బ్లాగుకు,

      ఒక చక్కని ప్రోత్సాహక స్పందన
      బాగుంది.
      ధన్యాభివాదాలు ఓలేటి గారు! శుభసాయంత్రం!!

      Delete
  2. తొలి చూపులో ప్రేమలా.....తుమ్ముతో ప్రేమ అన్నమాట.:-)

    ReplyDelete
    Replies
    1. తొలి చూపులో ప్రేమలా ..... తుమ్ముతో ప్రేమ అన్నమాట.:-)
      మొదటిది మెరుపు
      రెండవది ఇంద్రధనస్సు
      చక్కని స్పందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభోదయం!!

      Delete