Friday, June 27, 2014

తోడుంటాను .... ఒక జీవిత కాలం





ఆడకూతురా! .... అంతమైపోవాలనుకోకు .... ఈ రాతిరి,
విషనాగు బుసలు కొడుతూ
గుంటనక్క .... ఒకటి
నీ నిర్ణయం కోసమే ఎదురుచూస్తూ
బలవంతంగా నీ నోరు నొక్కేసే ఆలోచనలో
అపరిష్కృత పరిష్కృతి కోసం
స్వార్ధ ప్రయోజనం, ప్రత్యామ్నాయం కోసం
నీవు ప్రాదేయపడినా పట్టించుకోకుండా

ఎప్పుడైతే, నిన్నూ, నీ అస్తిత్వాన్నీ
ఒక వస్తువులా, మారక ద్రవ్యం లా వాడుకుని
నీ హృదయాన్ని ముక్కలు చెక్కలుగా చేసి
నీదైన ఆభరణం
నీ రక్షణ కవచం స్త్రీత్వాన్ని కూడా అపహరించి
బజారు లో భేరానికి పెట్టినప్పుడే
అర్ధం చేసుకునుండాల్సింది .... .అప్పుడైనా
ఎప్పుడూ అమానుషుడు అతడని.




అమితమూల్యం చెల్లించి మరీ కొన్నానని
తప్పనిసరై అమ్ముతున్నానని
అరేబియన్ల ముందు
తన ఆనందం కోసం నిన్ను
వేలం వేసేందుకు సిద్దపడిన ఆ నమ్మక ద్రోహి
నీ కన్నతల్లిదండ్రుల కన్నీటికి కారణం
అతని కోసం ఏడవొద్దు. కన్నీరు కార్చొద్దు
నీకు తోడుగా నేనున్నాను.




నేనిక్కడే నీ పక్కనే ఉన్నాను .... గమనిస్తూ
నన్ను నమ్ము!
ఆడకూతురా! అంతమైపోవాలనుకోకు!
అభిమానం అర్ధంతెలియని వ్యక్తి కోసం
అర్ధం చేసుకోలేని క్రియాహీనుడి కోసం
నీ జీవితాన్ని త్యాగం చేసుకోకు
నా జీవితంకన్నా అధికంగా ప్రేమిస్తానని మాటిస్తున్నాను.
నికు తోడుంటానని .... ఓ ఆడకూతురా!

4 comments:

  1. వేముల చంద్ర గారు ,


    అసలు ఆడా , మగా తేడా సృష్టి కొఱకే గాని , అంతర్లీనంగా వున్న శక్తిలొ కదు .
    ఆడకు మారు రూపం ఆ శక్తే , ఆ ఆదిశక్తేనన్నది మఱచిపోతున్నారు , మదన మాయలో పడి కదనరంగాన్ని సృష్టిస్తున్నాడు తోటి మగవాడు .

    ఓ వైపు శక్తికి మారు రూపాలుగా కొలవబడ్తున్న ఆడదేవతలను పూజిస్తూ , కళ్ళ ముందు కనబడ్తున్న ఆడకూతుళ్ళను అంగడిబొమ్మగా చిత్రించి , అరబ్బులకమ్మే అధమాధములను అధఃపాతాళానికి త్రొక్కి , నీకై తోడుంటాను ఓ జీవితకాలం అనే వాళ్ళున్నప్పుడు ఆడ కూతురే కాదు ఏడ కూతురైనా ధైర్యంగా వుండగలదని మీరిచ్చిన హామీ నిజమై నెరవేరుతుంది .

    ReplyDelete
    Replies
    1. వేముల చంద్ర గారు ,

      అసలు ఆడా , మగా తేడా సృష్టి కొఱకే గాని, అంతర్లీనంగా వున్న శక్తిలొ కాదు. ఆడకు మారు రూపం ఆ శక్తే, ఆ ఆదిశక్తేనన్నది మఱచిపోతున్నారు, మదన మాయలో పడి కదనరంగాన్ని సృష్టిస్తున్నాడు తోటి మగవాడు .

      ఓ వైపు శక్తికి మారు రూపాలుగా కొలవబడ్తున్న ఆడదేవతలను పూజిస్తూ, కళ్ళ ముందు కనబడ్తున్న ఆడకూతుళ్ళను అంగడిబొమ్మగా చిత్రించి, అరబ్బులకమ్మే అధమాధములను అధఃపాతాళానికి త్రొక్కి, నీకై తోడుంటాను ఓ జీవితకాలం అనే వాళ్ళున్నప్పుడు ఆడ కూతురే కాదు ఏడ కూతురైనా ధైర్యంగా వుండగలదని మీరిచ్చిన హామీ నిజమై నెరవేరుతుంది.

      శర్మ గారు మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను నా బ్లాగుకు

      మీ విశ్లేషణ చాలా బాగుంది.
      నమస్సులు శర్మ గారు! శుభమధ్యాహ్నం!!

      Delete

  2. చంద్ర గారూ

    కష్టాల్లో నేనున్నానని ప్రేమ హస్తాన్ని అందించిన తీరు చాలా బాగా చూపించారు


    ఇలాటి సబ్జక్ట్స్ ని ఎన్నుకుని వాటికి న్యాయం కూర్చేలా రాయడం మీకే సాధ్యం
    అభినందనీయులు మీరు.

    " వేలం వేసేందుకు సిద్దపడిన ఆ నమ్మక ద్రోహి
    నీ కన్నతల్లిదండ్రుల కన్నీటికి కారణం
    అతని కోసం ఏడవొద్దు. కన్నీరు కార్చొద్దు
    నీకు తోడుగా నేనున్నాను. ""

    గొప్పగా ఉన్నాయి మీ భావనలు.

    ప్రేమతో,
    మిత్రుడు
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. చంద్ర గారూ

      కష్టాల్లో నేనున్నానని ప్రేమ హస్తాన్ని అందించిన తీరు చాలా బాగా చూపించారు. "ఇలాటి సబ్జక్ట్స్ ని ఎన్నుకుని వాటికి న్యాయం కూర్చేలా రాయడం మీకే సాధ్యం" .... అభినందనీయులు మీరు.

      " వేలం వేసేందుకు సిద్దపడిన ఆ నమ్మక ద్రోహి
      నీ కన్నతల్లిదండ్రుల కన్నీటికి కారణం, అతని కోసం ఏడవొద్దు. కన్నీరు కార్చొద్దు .... నీకు తోడుగా నేనున్నాను. ""

      గొప్పగా ఉన్నాయి మీ భావనలు.

      ప్రేమతో,
      మిత్రుడు

      ఎంతో చిక్కని విశ్లేషణ పరిశీలన ప్రోత్సాహక స్పందన అభినందన
      అభివాదాలు *శ్రీపాద గారు!

      Delete