వర్షం కురుస్తున్నట్లు
ఉరుములు ఉరుముతున్నట్లు
ఆకాశం గాలిని పగులగొడుతున్నట్లు
మెరుపుల మయమౌతున్నట్లు
తలరాతలు మారి
అస్తిత్వం, ఉనికి కుదుపులకు లోనై
నా జీవితం లో ఒక అమూల్య అవసరం లా
పదే పదే కళ్ళముందు కదులుతూ .... ఆమె
శాంతి, సహనం, భూమాత రూపం
కన్నీళ్ళ స్నానం చేస్తూ
నా ప్రతి నిర్ణయం వేడికి పగిలిన గుండె
సేదదీర్చే వసంతం లా .... ఆమె
ఆ కన్నీళ్ళ అగ్ని జ్వాలలు
నా ఆలోచనలను ప్రభావితం చేసినా
నా నిర్ణయాల అసంపూర్ణత మాత్రం
నన్ను కాల్చేస్తున్నట్లుంటుంది.
పిచ్చీ! ఈ అద్భుతం చూడు!? అని
బిడ్డతో అమ్మ మాట లా
చిరునవ్వు కన్నా బలం గా నాటే ఆ పలుకరింపు లో
నన్ను నేను కోల్పోవాలనుంటుంది
ఆమె కంట తడి చూసిన ప్రతిసారీ
నాతో ఏడడుగులు నడిచి
నా గతజన్మ శాపాలన్నీ
నాతో పాటు ఆమె మోస్తున్నట్లు .... ఓహ్!
అసమంజసం అనుకునేలోగా
మళ్ళీ మళ్ళీ జరుగుతూ
ఎన్నాళ్ళు జీవిస్తానో కానీ
నా పాపాలన్నీ ఇలా, నాతో పాటు ఆమె
ఏ పాపమూ ఎరుగని ఆమె కు
నా గతజన్మ పాపఫలం
నా కష్టాలు, నా కన్నీళ్ళ పంచుతూ
నేను క్షమార్హుడ్ని, జీవనార్హుడ్ని కానేమో!
చిరునవ్వు కన్నా బలం గా నాటే ఆ పలుకరింపు లో
ReplyDeleteనన్ను నేను కోల్పోవాలనుంటుంది
,,,ఏమి చెప్పాలి మీకు మాత్రమే సొంతమైన ఈ పద ప్రయోగాలు కవితకు వన్నెతెస్తున్న్నాయి
చిరునవ్వు కన్నా బలం గా నాటే ఆ పలుకరింపు లో
Deleteనన్ను నేను కోల్పోవాలనుంటుంది.
,,,ఏమి చెప్పాలి మీకు మాత్రమే సొంతమైన ఈ పద ప్రయోగాలు కవితకు వన్నెతెస్తున్నాయి.
కొన్ని పద ప్రయోగాలు మానసిక సంఘర్షణలో అనూహ్య ఆవిష్కరణలై దొర్లుతాయి .... మీ కవితల్లో కూడా అలాంటి సందర్బాలను ఎన్నింటినో గమనించాను. శబ్దం తో కవిత్వాన్ని ఆవిష్కరించడం మీ శైలి. నాకు ఎంతో నచ్చుతుంది.
అభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
sir mee pada prayogaalu chaala baagunnai saralmaia telugulo very nice
ReplyDeleteసర్ మీ పద ప్రయోగాలు చాలా బాగున్నాయి సరళమైన తెలుగులో వెరీ నైస్
Deleteచాలా గొప్ప కాంప్లిమెంట్
ధన్యవాదాలు కలొగొట్ల వెంకట రత్న శర్మ గారు! శుభసాయంత్రం!!