నా మది లోతుల్లో
జాలరి వలలా అల్లుకుని .... చీకటి
అక్కడే
నిబద్దించలేని .... కోపం, ఆవేశం
నా రక్తం లో ఇంకి
రక్తనాళాలలో ఉదృతిగా మారి
ప్రమాదం పూచిన ....
విషపు నవ్వు లా
నన్ను,
నిలువునా కోసి
నా రక్తం అంతా తోడినా
ఇంకా ఊరుతున్న
ఆ విషాన్ని చూసాకైనా
తప్పదేమో నీకు, ప్రార్ధించక ....
నేను తప్పక చావాలని
వీలు కాదూ! ....
దూరంగా పారిపో!
ఆ విషం నిన్ను చేరకముందే,
అది సృష్టించే పాపం లో ....
నీవు నిండా మునిగిపోక మునుపే,
నా, నీ ఎవరి సంరక్షణ గురించి
ఆలోచించే స్థితిలో లేను నేను.
ఆ అల్లుకుపోయిన చీకటి
చిద్రం కావాలి .... ముందు.
చూస్తున్నావా!
నా కళ్ళు నుండి
కారేందుకు సిద్దంగా ఉన్న
ఆ రక్తం ప్రవాహాన్ని
నా కళ్ళ ఆ ఎర్ర జీరల్ని ....
కోపం భూతం ఏడుస్తూ
ఆకలిగా దిక్కులు చూస్తుండటాన్ని
కనిపించనంత దూరంగా పారిపోక తప్పదు
నాడు
చీమల పుట్టనుకుని కెలికావు.
అప్పుడే
ఈ యుద్ధం ఆరంభం అయ్యింది.
ఆట మొదలుపెట్టింది నీవా నేనా కాదు
విజయం ఎవరిది అన్నదే ముఖ్యం
ఛీదర, రోత, మడ్డి, మురికి, అన్యాయం, అధర్మం ....
ఏదీ తప్పు కాదు యుద్దం లో
నాకు మాత్రం
నా ఆత్మే నా యోధుడు
నీకు గెలిచే అవకాశం .... ఆలోచించనివ్వను.
అటు చూడు!
అక్కడ
భయం తో యుగాలుగా
నీలానే గెలవాలని పోరాటం ఆరంభించి
నీడలో నీడలా
మిగిలిపోయిన అస్తిత్వాని
విశ్వమానవ కళ్యాణం కోరుకునే నేను
స్వఛ్చమైన పాపాత్ముడినిలా .... ఎందుకిలా
రూపాంతరము చెందానో చూడు
నీకు భరించకతప్పదు
నిన్ను నేను మరణించనీయనంతవరకు
నేను ముందే హెచ్చరించాను
నా మది లోతుల్లో
పంజరం లో
కోపం, ఆవేశం నిన్ను దహించేస్తాయని
No comments:
Post a Comment