అడవి మనిషి లా అడవితల్లి ఒడిని
ఆశ్రయించి ....
ఔనూ!? ఏవరైనా
ఎప్పుడైనా నాలా ఇలా అనుభూతి చెందారా?
అనిపించిందా ఎవరికైనా? ఎప్పుడైనా?
పిల్ల మేఘం గుర్రం మీద దౌడుతీసినట్లు
భారమనిపించిన బాధలన్నీ ఎవరో సుతారంగా తీసేసినట్లు
మళ్ళీ జన్మించి
ప్రకృతిమాత ఒడిలో ఆడుకున్నట్లు,
సంతోషం గా స్వేచ్చ గా విహరించినట్లు .... కలలో
క్షమ, సహనం సహవాసం చేసిన ఆ చోట
నదీమ తల్లి కనుసన్నల్లో కదిలిన నేను
అంతా నాకే తెలిసినట్లు
మెలికలు తిరుగుతూ నది
నా కోసమే ఎటో వెళుతుందన్నట్లు
సరదాగానో
షికారుకు గానో
స్వర్గానికో
సాగరం లో మమైకమయ్యేందుకో
జీవించి గమ్యం చేరే లోపు
కల్మషాలను ఎన్నింటినో కడిగేసి .... నదీమతల్లి
స్వేదం చిందిన నేలపై
పంట పొలాలపై
తనను తాను కొంత కోల్పోయి
పవిత్రంగా
పరవళ్ళ ప్రవాహంగా
నగ్న నిరాభావం తో ఆవిరై పోతూ
స్వారీ చేసేందుకు .... మేఘాల గుర్రం పై
జుగుప్స అనిపించని నగ్న రూపం తో
వేళ్ళ మధ్య బురద తో .... ఆ కదలికలే ఆదర్శం గా
జీవించాలని .... ఓ కోరిక ఉదయించి
అడవి జంతువులు స్వాగతించడాన్ని చూసా!
అక్కడ ఎవరూ ఎవరినీ అకారణంగా గాయపర్చరు.
అప్పుడే
చీకటికి హృదయం లేదని తెలిసింది.
ఆక్షేపించని, అసూయచెందని
సరదా సరదాగా సాగే జీవితం వాటిది
ఏ చెడూ చూడని, వినాల్సిన అగత్యం లేని
ఆ మూగతనం స్వర్గతుల్యమనిపించుతూ!
గతాన్ని, పీడకలలను దూరంగా విసిరేసి
సంకుచితత్వాన్నొదిలేసి, నిద్దుర లేచి
కదలాలనిపించిన క్షణాలవి
నాకుగా నేను ఆశ్చర్యపోయేలా
నాగరికత సరిహద్దుల్ని దాటి,
దండకారణ్యం
కొత్త ప్రపంచం లోకి అడుగిడి
ఎన్నో కొత్త ప్రాణులు కొత్త బంధాల మధ్య
అక్కడ,
వెలుతురు చూరు క్రింద చెయ్యగలిగిందంతా చేస్తే
ఇలయే కదా స్వర్గసీమ అనిపించింది .... చిత్రం గా!
This comment has been removed by the author.
ReplyDeleteఎన్నో కొత్త ప్రాణులు కొత్త బంధాల మధ్య
ReplyDeleteఅక్కడ,
వెలుతురు చూరు క్రింద చెయ్యగలిగిందంతా చేస్తే
ఇలయే కదా స్వర్గసీమ అనిపించింది .... చిత్రం గా!........,అడవితల్లిని స్వర్గముతో పోల్చి స్వర్గానికి మెట్లేశారు, చాలా నిర్మ్లలంగా ఉంది చదువుతుంటే
ఎన్నో కొత్త ప్రాణులు కొత్త బంధాల మధ్య
Deleteఅక్కడ,
వెలుతురు చూరు క్రింద చెయ్యగలిగిందంతా చేస్తే
ఇలయే కదా స్వర్గసీమ అనిపించింది .... చిత్రం గా!........,
అడవితల్లిని స్వర్గముతో పోల్చి స్వర్గానికి మెట్లేశారు, చాలా నిర్మ్లలంగా ఉంది చదువుతుంటే
ఒక చక్కని ప్రేరణాత్మక స్పందన. మీ ప్రతి స్పందన ద్వారా నా భావాలకు బలం చేకూరుతుందని చెబితే అతిశయోక్తి కాదు. నిజం!
ధన్యాభివాదములు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!