ఒక మజిలీ కానిది ఏనాడూ పొరపడనిది
అమ్మ ప్రేమ
అన్ని అవసరాలు తీర్చడం
అమ్మ లక్ష్యం,
అమ్మ కల
ప్రాణం పొయ్యడంతో పాటు
స్వయం స్వతంత్రత ను చేకూర్చాలని,
అమ్మ సంకల్పం
ప్రేగు తెంచుకుని పుట్టిన చిరంజీవి
జీవితం స్వర్గమయం కావాలని
తన కష్టం, తన తపస్సు, తన పూజ .... సర్వం
వారి కోసమే అని
వారిపై ప్రేమను పెంచుకుని
చూసి ఆనందించడం కోసమే అని
ఆరాటపడి,
ఆ మాటల్లో ఎప్పుడూ వారి రక్షణ తపనే ....
ఒక జీవిత కాలం పాటు .... వారిని
కళ్ళల్లో పెట్టుకుని చూడాలని
తిరిగి చూడబడాలనుకోని
కేవలం చూడాలనే
ఎలాంటి అలజడి, ఉపద్రవం ప్రమాదం
కలగకుండా చూడటం తన విధి అనుకుని
పెంచి, పంచడానికే ....
తనలో ఈ అనురాగం మమకారం ప్రేమ అని
ఆనందం, సంరక్షణ సునిశ్చితం చెయ్యడమే విధి గా
జీవితం రహదారిలో
ఎదురుపడే రాళ్ళూ, ముళ్ళను ముద్దాడి
అవి, వారికి ఎలాంటి హానీ తలపెట్టనివిదంగా
తన స్వేదం, కష్టం, కన్నీళ్ళని చెప్పులు,
బట్టలుగా అమర్చి
తరగని తన ప్రేమను పంచుతూ .... అమృతమూర్తి అమ్మ
అమ్మ ప్రేమ,
ఒక వడలని పుష్పం, ఒక చెయ్యని వాగ్దానం!
ఒక వడలని పుష్పం, ఒక చెయ్యని వాగ్దానం!
ReplyDeleteనిజమే అమ్మ వడలని పుష్పం. గొప్ప పోలిక.
ఒక వడలని పుష్పం, ఒక చెయ్యని వాగ్దానం అమ్మ!
Deleteనిజమే! ఒక అమ్మ వడలని పుష్పమే.
గొప్ప పోలిక.
గొప్ప స్పందన,
అమృతమూర్తి అమ్మ ఎప్పుడూ వడలని పుష్పమే మమకారం పరిమళాలు సదా వెదజల్లుతూ
ధన్యమనోభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!