Sunday, June 8, 2014

మృగతుల్యత




నేనూ, ఒక మనిషినే అని గుర్తు చేస్తూ,
మది లోని మొరటుతనం ను ముక్కల్ని చేసి
సున్నితత్వం ఎరుగని మనిషిని నాలో
నీ స్పర్శ, సామరశ్యపు పలుకరింపు
సున్నితత్వం,
ఒక అలజడి సునామిగా మారి,
ఆ తాకిడికి
ఉద్వేగం అల ఒకటి ఉవ్వెత్తున ఎగసి,
ఆ తుంపరలు
నెర్రెలువారిన నా కరడు గుండె
ముక్కలు పగుళ్ళలోకి జారి
ఏదో హాయి 



అప్పుడే, తొలిసారే అనుకున్నాను.
సున్నిత తత్వం పై నాకు నియంత్రణ లేదని,
యెండి, మాడి, శిధిలమై .... 

హృదయ రహితుడ్నని
ఇలా
జీవనాలింగన చొరవను స్వాగతించి
ఆనందించలేని కనికరం లేని కసాయినిలా,
అవివేకిని లా నీ ముందు
ఓ మృగతుల్యుడ్నై నిలబడాల్సొచ్చి ....

2 comments:

  1. సున్నితత్వం లోని
    కాఠి న్యాన్ని
    సున్నితంగా చెప్పారు
    చంద్రగారు..
    దానికి అనురాగపు
    ఆప్యాయత
    ఆసరా అయినపుడే
    నియంత్రణలో నిలకడగా
    నిలుస్తుంది. 

    ReplyDelete
    Replies

    1. సున్నితత్వం లోని కాఠి న్యాన్ని సున్నితంగా
      చెప్పారు చంద్రగారు..
      దానికి
      అనురాగపు ఆప్యాయత ఆసరా అయినపుడే
      నియంత్రణలో నిలకడగా నిలుస్తుంది. 

      ఎంత చక్కని విశ్లేషణ. సునిశిత దృష్టి కోణం. చిత్రకారులకే సాద్యం. చాలా బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు జానీ పాషా గారు! శుభోదయం!!

      Delete