అక్కడ సర్వం సవ్యంగా జరుగుతున్నట్లే ఉంటుంది
అంతలోనే దారి తప్పిపోయామనిపిస్తుంది.
గులకరాళ్లు, మొరపరాళ్లు, జల్లి,
కంకర వదులు వదులుగా ఉండి
దిగబడిపోనూవచ్చు .... మనం
ఆకశ్మికం గా ఏ ఊబిలోకైనా జారిపోనూవచ్చు
ఆ క్షణం లో ఆ ఊబే మన వాస్తవికత
వాస్తవికతకు దూరం గా ఎక్కడికీ పారిపోలేము
లోపాలు లేని రహదారి ఉంటుందనుకోనూ లేము
రుచిరహిత పరిహాసం లా అనిపించినా
అదే నిజం! అదే వాస్తవం!
ఎప్పుడు, ఎక్కడ, ఎలా మెల్లగా నడవాలో
ఎప్పుడు పట్టుదొరుకుతుందని ఎదురుచూడాలో
నేర్చుకుని నడుచుకోవల్సింది మనమే
అది చదునైన సిమెంట్ రోడ్డూ కాదు
తారు రోడ్డు అంతకన్నా కాదు
సమతలం గా ఉండాల్సిన అగత్యం లేని
ప్రాకృతికం గా ఏర్పడిన మట్టి రోడ్డు
ఈ ప్రయాణం
ఇలాగే ఉంటుందని ఊహించలేని
ఋతు ప్రభావి రహదారి అది
ఆ రహదారిలో గతుకులే అన్నీ ....
చంద్ర గారూ
ReplyDeleteమీ భావనలేప్పుడు వాస్తవిక జీవనానికి దగ్గరగా,
హృదయానికి హత్తుకుపోయేలా ఉంటాయ్.
అదీ మీ ప్రత్యేకత.
"వాస్తవికతకు దూరం గా
ఎక్కడికీ పారిపోలేము
లోపాలు లేని రహదారి ఉంటుందనుకోనూ లేము
రుచిరహిత పరిహాసం లా అనిపించినా
అదే నిజం! అదే వాస్తవం! "
ఎంత మంచి భావాలో కదా
అభినందనలు మీకు చంద్ర గారూ .
*శ్రీపాద
చంద్ర గారూ
Delete"మీ భావనలేప్పుడు వాస్తవిక జీవనానికి దగ్గరగా,
హృదయానికి హత్తుకుపోయేలా ఉంటాయ్." అదీ మీ ప్రత్యేకత.
"వాస్తవికతకు దూరం గా ఎక్కడికీ పారిపోలేము
లోపాలు లేని రహదారి ఉంటుందనుకోనూ లేము
రుచిరహిత పరిహాసం లా అనిపించినా .... అదే నిజం! అదే వాస్తవం! "
ఎంత మంచి భావాలో కదా! అభినందనలు మీకు చంద్ర గారూ .
ఎంతో చక్కని స్వీకరణ స్పందన స్నేహ ఆత్మీయాభినందన
ధన్యవాదాలు *శ్రీపాద గారు!