Monday, June 16, 2014

భిన్న ఏకత్వం




రెండు చెట్ల
ఇరు ఆత్మల కాండాలు
ఒకదాన్నొకటి మెలివేసుకుని
కొంత మేర ఒక్కటైపోయి,
భూమ్మీద
ఒక ఆహ్లాదకర ఏకీకరణ

ఆ ఆత్మల శరీరాల
వ్యక్తిత్వ అస్తిత్వాల
వేళ్ళు
విడి విడిగా లోతుగా
భూమిలోకి
బలంగా పాతుకుపోయి .... 




అది
జీవ సౌలభ్యం కోసమో
ఏమో
కానీ

స్వతంత్రతను కాపాడుకుంటూ
ఆ వేళ్ళు భూమి లో
కలిసిపోయిన
ఆ ఎత్తైన శాఖలు ఆకాశం లో
ఒక అద్భుతమైన అల్లిక
ప్రతి సృష్టి లా .... ప్రకృతి మహిమ

2 comments:

  1. ఒక అద్భుతమైన అల్లిక
    ప్రతి సృష్టి లా .... ప్రకృతి మహిమ...,
    బగవంతుని సృష్టే్ కదా అందుకే ఆ అద్భుతం.

    ReplyDelete
    Replies
    1. ఒక అద్భుతమైన అల్లిక
      ప్రతి సృష్టి లా .... ప్రకృతి మహిమ...,
      బగవంతుని సృష్టే కదా అందుకే అంత అద్భుతం.

      ఒక చక్కని భావస్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!

      Delete