పొరపాటులే అన్నీ
తొందరపాటులే మళ్ళీ మళ్ళీ
సలహాలు వినీ వినీ
పారిపోవాలని మళ్ళీ మళ్ళీ
అబౌతికం ముక్తిపదం లోకి .... నానుంచి నేను
అతి పెద్ద సంసారంలో
అతి కొద్ది అవకాశం .... జీవితం
మార్గాలన్నీ మూసుకుపోయి
శబ్దరహిత శున్య ఆలోచనలకు దూరంగా
పారిపోవాలని .... వాస్తవానికి దూరం గా
ఒక కొత్త ప్రాణం
మళ్ళీ పుట్టేందుకు
మరణించి
కొత్త దిశ గమ్యం వైపు పయనించేందుకు
ఒక ఆత్మ .... మరో కొత్త నేను లా
పుట్టి, ఎదిగి, పండి క్రుళ్ళిపోవాలని
నుదుట రాయబడి
రోగాలు రొష్టులకు భారినపడి
నేరస్తుడిలా పరుగులుతీసి
జీవబంధాల నుంచి విముక్తుడయ్యేందుకు
ఎన్ని రాత్రిళ్ళు గడిచిపోయాయో
నిశ్శబ్దం మాత్రం సమసిపోలేదు
అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే
గొడలులా అడ్డొస్తూ .... గమ్యం దిశలో
వాస్తవికతకు ఎదురుపడలేక
ఎన్నిరాత్రులు గడిచినా,చెదరని తమస్సు.
ReplyDeleteఎంత తపస్సుచేసినా తిరిగిరాని ఉషస్సు.....,ఇదీ జీవితమంటే.
Deleteఎన్నిరాత్రులు గడిచినా, చెదరని తమస్సు.
ఎంత తపస్సు చేసినా తిరిగి రాని ఉషస్సు.....,ఇదే జీవితమంటే.
చాలా క్లుప్తంగా అందమైన విశ్లేషణ ఏకీభావన
నమస్సులు ఫాతిమా గారు!
జీవితాన్ని కాచి వడపోసిన కవిత
ReplyDelete
Deleteజీవితాన్ని కాచి వడపోసిన కవిత
బాగుంది అనుభవాన్ని అభినందించిన స్పందన
ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభసాయంత్రం!!