నిన్నే
నేనిచ్చిన ప్రతిదీ
బేషరతుగా పుచ్చేసుకోవాలనుంది.
అర్ధం కానట్లు
ఆ అభినయం తగదు
ఆ నేన్నిన్ను ప్రేమిస్తున్నానులు
ఆ బుజ్జగింపులు
ఆ ముద్దుముచ్చట్లు
ఆ కౌగిలి లు
ఆ ప్రేమ ....
అన్నీ
గుండె లోతుల్లోంచి పలికిన పలుకులు
నీతో పంచుకున్న ఆ ఆకాంక్షలు
అన్నీ
నీవు నాకు తిరిగిచ్చేస్తే
పుచ్చుకోవాలి .... నీ నుంచి
చచ్చిపోతానేమో అనిపిస్తూ
శరీరమంతా ఆబ
తట్టుకోలేని తపన
వేడి
ఆవిరులు
అంతరంగాన్ని చల్లబరుచుకుందుకు
ఈ వెన్నెల లో
ఈ మంచు లో
పిచ్చివాడి లా ఇలా
ద్వేషం,
నిస్పృహలతో ....
కొన్ని ఆత్మల ఆనందం కోసం లా ....
తిరుగుతున్నాను.
అందుకే
ఓ అందాల రాక్షసీ
నేనిచ్చినవన్నీ తిరిగి పుచ్చేసుకుంటా!
చంద్ర గారూ !
ReplyDeleteచూసారా నేనన్ననుగా మీరు అన్ని రకాల రసాలను
పిండించగలరని.
సూపరో .. సూపర్ సారూ .
" విరహం తో సంచరిస్తున్న
కొన్ని ఆత్మల ఆనందం కోసం లా ....
తిరుగుతున్నాను.
అందుకే
ఓ అందాల రాక్షసీ
నేనిచ్చినవన్నీ తిరిగి పుచ్చేసుకుంటా! ""
అమ్మో అమ్మో
కొంటెదనాన్ని మిళితం చేసి చాలా బాగా రాసారు కవితను
అభినందనలు మీకు చంద్ర గారూ !
* శ్రీపాద
చంద్ర గారూ !
Deleteచూసారా నేనన్ననుగా మీరు అన్ని రకాల రసాలను పండించగలరని. సూపరో .. సూపర్ సారూ .
" విరహం తో సంచరిస్తున్న
కొన్ని ఆత్మల ఆనందం కోసం లా .... తిరుగుతున్నాను.
అందుకే, ఓ అందాల రాక్షసీ నేనిచ్చినవన్నీ తిరిగి పుచ్చేసుకుంటా! ""
అమ్మో అమ్మో! కొంటెదనాన్ని మిళితం చేసి చాలా బాగా రాసారు కవితను .... అభినందనలు మీకు చంద్ర గారూ !
మీకూ మీ విశ్లేషణకూ ధన్యవాదాలు శ్రీపాద గారు. మీ పరిశీలనాత్మక ప్రోత్సాహక స్పందనకు అభినందనకు
నమస్సులు *శ్రీపాద గారు!