కలలు నిన్ను కనికరించి,
నిద్దురలోనూ పరవసించి,
నీకు నీవుగా,
స్వేచ్చా విహంగానివి లా ఎగిరిపోయేలా ....,
విరిగిన నీ ఆశల రెక్కలు సరి చేస్తా,
ఆ గగన సీమలకు ఎగిరిపోదాం, .... వస్తావా నాతో?
మున్నెన్నడూ చూడని,
కలల లోకానికి,
కనపడని బాధల ఉపశమనానికి,
గాయాలు సమూలంగా మాయమయ్యే చోటుకు,
అంతా నీదే, అన్నీ నీవే అనిపించి,
స్వేచ్చగా పరుగులు తియ్యాలనిపించే
ఆ, బృందావనానికి .... వస్తావా నాతో ?
రాత్రిళ్ళను పగళ్ళుగా మార్చేస్తాను.
ఆ సూర్యుడ్నే నేనై .... నీ జీవితం లో,
భయమెరుగని ఉల్లాసోత్తేజాలతో,
ఆ గగనాన్ని చేరి చంద్రుడితో ముచ్చట్లాడి,
ఆ తారలతో ఎకసక్కాలాడే లా చూస్తా,
నీ కళ్ళలోకి చూస్తూ నేను పొందే తన్మయ భావన
నీలోనూ కలిగేలా చేస్తా, .... వస్తావా నాతో?
నేను అనే పందిరికి పూల తీగవై,
పరిమళానివై అల్లుకుపోతావా నన్ను?
భావం రిపీట్ కావటంతో తీసివేయటం మంచిదనిపించి , తీసివేశాను .
ReplyDeleteఒకమారు పరిశీళించండి .
నీ కలలు నిన్ను కనికరించేలా,నీకు నీవుగా ,
స్వేచ్చా విహంగానివి లా ఎగిరిపోయేలా ....,
విరిగిన నీ ఆశల రెక్కలు సరి చేస్తా ,
ఆ గగన సీమలకు ఎగిరిపోదాం ,
వస్తావా నాతో ?
మున్నేన్నడు చూడని, ఆ కలల లోకానికి ,
కనపడని బాధల ఉపశమనానికి ,
పై గాయాలు మాయమయ్యే చోటుకు ,
అంతా నీదే, అన్నీ నీవే అనిపించి ,
స్వేచ్చగా పరుగులు తియ్యాలనిపించే ఆ ,
బృందావనానికి .... వస్తావా నాతో ?
రాత్రిళ్ళను పగళ్ళుగా మార్చేస్తాను.
ఆ సూర్యుడ్నే నేనై .... నీ జీవితం లో ,
భయమెరుగని ఉల్లాసోత్తేజాలతో ,
ఆ గగనాన్ని చేరి చంద్రుడితో ముచ్చట్లాడి ,
ఆ తారలతో ఎకసక్కాలాడే లా ,
నీ కళ్ళలోకి చూస్తూ నేను పొందే ,
తన్మయ భావన నీలోనూ కలిగేలా చేస్తా ,
వస్తావా నాతో ?
నా జీవన బంధపు బాంధవ్యానివై ,
నేననే పందిరికి పూల తీగవు నీవై ,
అల్లుకుపోతావా నాతో ?
భావం రిపీట్ కావటంతో తీసివేయటం మంచిదనిపించి, తీసివేశాను.
Deleteఒకమారు పరిశీళించండి.
పరిశీలించడంతో పాటు ఎడిట్ కూడా చేసాను మీ సూచనల మేరా. చాలా బాగుంది.
_/\_లు శర్మ గారు!!
నా జీవన బంధపు బాంధవ్యానివై,
ReplyDeleteనేను అనే పందిరికి పూల తీగవై,
good comparison sir
నా జీవన బంధపు బాంధవ్యానివై,
Deleteనేను అనే పందిరికి పూల తీగవై,
గుడ్ కంపారిజన్ సర్ ....
చక్కని పరిశీలన స్నేహ ప్రోత్సాహక స్పందన అభినందన
ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభోదయం!!