Monday, July 28, 2014

తొందరెక్కువయ్యింది .... ప్రయాణానికి


నీడలా నన్ను వెంటాడుతూనే వుంది .... ఆమె
ప్రతి క్షణమూ ....

ఏ బలహీన క్షణాలలోనో 
నలు వైపుల్నుంచి నన్నల్లుకుపోయి,
రేపనే నా భవిష్యత్తును .... 

నాకు దూరం చేసేయాలని,

ఏవైపునుంచి వస్తుందో తెలియదు.
దాగుడుమూతలాడుతూ ఉంది.

శత్రువనుకోలేను.
నెచ్చెలి అనుకోలేను .... ఆమెను.


ఆ రోజు తప్పకుండా వస్తుంది
నా ఆశలు, కలలు, ఆరాటాలకు అంతం పలకాల్సిన రోజు.

ఆమెకు తెలుసు
ఆ సమయం కోసమే ఎదురుచూస్తుందామె
నా శ్వాసను ఆపేందుకు సిద్ధం గా ....

ఏ క్షణాన్నైనా ఆమె నన్ను పలుకరించొచ్చు
నాకు జీవన మోక్షమూ కలిగించొచ్చు!

అందుకే , ఈ లోగా ,
నా బాధ్యతలన్నీ నెరవేర్చుకునుందామనే
నాలో ఈ తొందర .....


నీడలా నన్ను వెంటాడుతూనే వుంది .... ఆమె

2 comments:

  1. ఈ దు(స్థితి) ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణీ తెలిసి(నా) తెలియకపోయినా అనుభవించితీరవలసినదే .
    చక్కటి భావం .

    నీడలా నన్ను వెంటాడుతూనే వుంది ,

    ఏ బలహీన క్షణాలలోనో ,
    నలు వైపుల్నుంచి నన్నల్లుకుపోవాలని ,
    రేపనే నా భవిష్యత్తును ,
    నాకు దూరం చేసేయాలని ,

    ఆ సమయం కోసమే ఆ ఎదురుచూపులు
    నా శ్వాసను ఆపేందుకు సిద్ధం గా ....

    ఏ క్షణాన్నైనా నన్ను పలుకరించొచ్చు
    నాకు జీవన మోక్షమూ కలిగించొచ్చు!

    అందుకే , ఈ లోగా ,
    నా బాధ్యతలన్నీ నెరవేర్చుకునుందామనే
    నాలో ఈ తొందర .....

    నీడలా నన్నెప్పటికీ వెంటాడుతూనే వుంది .

    ReplyDelete
    Replies
    1. ఈ దు(స్థితి) ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణీ తెలిసి(నా) తెలియకపోయినా అనుభవించితీరవలసినదే .
      చక్కటి భావం.
      మీ ప్రశంస తో పాటు మీ సూచనలను మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాను. అదృష్టవంతుడ్ననుకుంటున్నాను. మీ స్నేహ హస్తం పొందగలగడం
      _/\_లు శర్మ గారు!

      Delete