Monday, July 7, 2014

వాగ్దానానికి విలువుంటుంది




పెదవి దాటిన వాగ్దానం ....
ఇచ్చిన మాట కు
ప్రాణం ఉంటే
ఆ పదం కృత్రిమ
ఖాళీ పదం గా పరిణమించదు.

మాటకు కట్టుబడేందుకే
నిర్ణయించుకున్న
ఒక ఆత్మ
తన వాక్కుకు
దైవత్వాన్ని చేకూర్చాలనుకోవడమే.

తేట తెల్లని వర్తమానం లో
జ్ఞాపకం లా కాక
నిన్ననే నిర్దేశించబడిన నేటి వాస్తవం లా
కర్మ శాసనాన్ని
కాలం గుండెలపై, పుట్టుమచ్చలా రాసినట్లు




ఆలోచనల పునఃసృష్టి ద్వారా
ప్రతి క్షణం
ఎవరో చేసిన ఏ వాగ్దానం యొక్క శబ్దతరంగాలో
కాల చక్రం ఇరుసు శబ్దం లో
నివసిస్తూ .... చరిత్రపుటల్లో సారమైనట్లు

ఒక్కటి మాత్రం నిజం ....
బీష్మ స్వచ్చత అవసరం
వాగ్దానమే అయినా ఒట్టే అయినా
అబద్దాల రాజకీయుల మాటలే అయితే ....
ఆ వాగ్దానం విలువెంతని?

4 comments:

  1. ఇలా మొదలైతే బాగుండేదేమో .......

    పెదవి దాటిన మాట కు ,
    ఇచ్చిన వాగ్దానానికి ,
    ప్రాణం ఉంటే
    ఆ పదం కృత్రిమ
    ఖాళీ పదం గా పరిణమించదు.

    ఈ పద ప్రయోగం చాలా బాగుంది .

    తేట తెల్లని వర్తమానం లో
    జ్ఞాపకం లా కాక
    నిన్ననే నిర్దేశించబడిన నేటి వాస్తవం లా
    కర్మ శాసనాన్ని
    కాలం గుండెలపై, పుట్టుమచ్చలా రాసినట్లు

    చాలామందికి భీష్ముడికి అంత శక్తి ఎలా వచ్చిందో తెలియని వాళ్ళున్నారు . అసలు ఆ పేరు ఎలా వచ్చిందో కూడా తెనిర్ణయమైపోయింది .
    లియదు .
    ఆతని పేరు దేవవ్రతుడు . తన తండ్రి శ్రేయస్సు కొ`రకు , తన శ్రేయస్సును వదలుకొని భీషణ ప్రతిఙ్న చేయటం వలన ఆతనికి " భీష్ముడు " అని కాలక్రమంలో చిరస్థాయిగా నిలిచిపోయింది .

    ఇక్కడ కొంచెం మార్పు చేస్తే బాగుంటుంది .

    ఒక్కటి మాత్రం నిజం ....
    బీష్మ స్వచ్చత అవసరం
    వాగ్దానం అయినా , ఒట్టు అయినా
    అబద్దాల రాజకీయ నాయకుల మాటలు అయినా ,
    ఆ భీష్మ స్వఛ్ఛత వుంటేనే విలువ .

    ReplyDelete
    Replies
    1. చాలామందికి భీష్ముడికి అంత శక్తి ఎలా వచ్చిందో తెలియని వాళ్ళున్నారు. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో కూడా తెలియదు .
      వాస్తవానికి ఆతని పేరు దేవవ్రతుడు. గంగాదేవి శంతను మహారాజుల పుత్రుడు. తన తండ్రి అబిలాష నెరవేరడం కొ`రకు, తన శ్రేయస్సును వదలుకొని భీషణ ప్రతిఙ్న చేయటం వలన ఆతనికి "భీష్ముడు" అని కాలక్రమంలో చిరస్థాయిగా నిలిచిపోయింది .

      ఇక్కడ కొంచెం మార్పు చేస్తే బాగుంటుంది.

      మీ విశ్లేషణా వ్యాఖ్యలు చక్కని మార్గదర్శకాలు. మీ సూచనను గుర్తుంచుకుని మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తాను.
      ధన్యమనోభివాదాలు శర్మ గారు! సుప్రభాతం!!

      Delete
  2. విలువైన ప్రశ్న విలువ కూడా మీరే చెప్పగలరు

    ReplyDelete
    Replies
    1. విలువైన ప్రశ్న విలువ కూడా మీరే చెప్పగలరు
      బాగుంది నమ్మకం స్నేహ ప్రోత్సాహక స్పందన
      హన్యవాదాలు పద్మార్పిత గారు! శుభోదయం!!

      Delete