Monday, July 7, 2014

నా జీవన వసంతం నీవు




నా నమ్మకం, నా కోరిక
నూతనత్వం దిశగా అడుగులెయ్యాలని
ఆశ ....
జీవితం లో ఒక కొత్త గృహం
ముంగిట్లో గొబ్బెమ్మలు .... ప్రామాణికంగా
నిద్దుర లేవాలని ....
ఎన్నాళ్ళుగానో
అరుదైన ఎదురుచూపుల కలలు.

ఎవరూహించగలరు?
జీవితం ఇలాగే మలుపు తిరిగి
నా కల నిజమౌతుందని.

నీస్పర్శానుభవం పొందిన క్షణానే
నాకు అర్ధం అయ్యింది.
నీ స్పర్శతో,
ఒక ఆకశ్మిక మందమారుతానివని,
సరికొత్త జీవన బాష్యానివని, 
స్వచ్చతవు ....
చిరునవ్వు పరిమళానివని, 
మధురభావ గీతికవని,
నా జీవితం లోకి ప్రవేశించేందుకే వచ్చావని   




ఆ క్షణం లో ....
నీవు నేను మాత్రమే శాశ్వతమై
కాలం స్తంభించిపోవాలని కలిగిన ఆలోచన
ఆ క్షణం కోసమే ఎన్నాళ్ళుగానో
హృదయం లో స్థానం శూన్యం లా ఉంచడమనే
భావన లోని సంకుచితత్వం
మది ఇబ్బందిగా మారి

నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని
చెప్పిన నాటి నుంచి
ప్రేమిస్తున్నదే నిజమే అయినా
ఎదురుచూస్తూ నీవూ నన్నే ప్రేమించాలనే
ఉద్దేశ్యం లో ఉన్న కారణం స్వార్ధం గా
ఎన్ని వసంతాలు వచ్చాయో
ఎన్ని శిశిరాలు పోయాయో
ఎన్ని అనుమానాలు, ఎన్ని ఆపోహలు
ఎన్ని స్వార్ధ బాష్యాలు
అన్నింటిలోనూ నీవే గమ్యం
నీకో ప్రత్యేకతుంచి నీ నీడ తోడుగా
కలిసి నడవాలనుకున్న నిర్ణయం వెనుక 
నా జీవన వసంతం నీవనే భావనేనేమో!?

4 comments:

  1. కల నిజమైన వేళాయె . ఆ నిజమే జీవన వసంతమాయె . ఆ జీవనమే సంతసమాయె . చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. కల నిజమైన వేళాయె. ఆ నిజమే జీవన వసంతమాయె. ఆ జీవనమే సంతసమాయె. చాలా బాగుంది.
      చక్కని పద సందానం తో చిక్కని స్నేహ ప్రోత్సాహక స్పందన
      నమస్సులు శర్మ గారు!

      Delete
  2. చాలా బాగారాసారు.

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా రాసారు
      చాలా బాగుంది స్పందన అభినందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు!

      Delete