అంతరంగంలో లో లోపల
అంతా నేను లా
అగ(హ)పడుతూ ఉన్నా నేను
కానీ ఇప్పుడు,
ఇక్కడ సమాజం కట్టుబాట్ల నడుమ
పంజరం లో పక్షిలా.
జీవితం జంతుప్రదర్శనశాల లా
ఒక ఆటవిక న్యాయస్థానం
నా నుదుట చెరగని మచ్చలా
నా గుణం, నా పరపతి
పచ్చబొట్టు చిరునామాలా
అక్షరాలు
ఆయుధాలుగా వాడే
వింత మానవ జంతువును నేను
దూరంగా ఉండే నన్ను
గమనించాలి అని
జాగ్రత్త! ప్రమాదం అని రాసి ఉంది.
దూరం దూరం అంటూ
ఎవరో అరుస్తూ ఉన్నారు.
ఔనూ! ఎవరు ఆ అతను?
అతను నాకు ఒక అపరిచితుడే
కానీ దబాయిస్తున్నాడు.
నా నుంచి ఏమి ఆశిస్తున్నాడో?
అపరిచితుడైన అతనితో
నేను రాజీ పడితే
జీవన యాత్రలో సంఘటితమైపోతే
అతన్నీ నన్నూ
అపరిచుతుల్ని చేసి
సమాజం బోనులో బంధీలను చేసేస్తుంది కదా!,
మూల్యం చెల్లించక తప్పదు జీవించేందుకు.
విషయం చాలా బాగున్నది .
ReplyDeleteఅంతరంగంలో లో లోపల
అంతా నేనులా
అగపడుతూ ఉన్నా .
కానీ ఇప్పుడు,
ఇక్కడ సమాజం కట్టుబాట్ల నడుమ
పంజరం లో పక్షిలా .
జీవితం
జంతుప్రదర్శనశాల లా
ఒక ఆటవిక న్యాయస్థానం
నా నుదుట చెరగని మచ్చలా
నా గుణం , నా పరపతి
పచ్చబొట్టు చిరునామాలా
అక్షరాలు
ఆయుధాలుగా వాడే
వింత మానవ జంతువును నేను
దూరంగా ఉండే
నే గమనించాలి అని
జాగ్రత్త! ప్రమాదం అని రాసి ఉంది.
దూరం దూరం అంటూ
ఎవరో అరుస్తూ ఉన్నారు
ఔను! ఎవరో అతను?
అతను నాకు అపరిచితుడే
కానీ దబాయిస్తున్నాడు.
నా నుంచి ఏమి ఆశిస్తున్నాడో?
అపరిచితుడైన అతనితో
నేను రాజీ పడితే
నా ఈ జీవన యాత్రలో సంఘటితమైపోతే
అతన్నీ నన్నూ
అపరిచుతుల్ని చేసి
సమాజం బోనులో బందీలను చేసేస్తుంది కదా! ,
మూల్యం చెల్లించక తప్పదు జీవించేందుకు .
మీ ఎడిటింగ్ చాలా బాగుంది. మీనుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. భావాలను పదిలంగా క్లుప్తంగా చక్కగా క్రమీకరించారు.
Deleteధన్యమనోభివాదాలు శర్మ గారు!