Wednesday, July 23, 2014

ఎంతో కాలంగా



మల్లె తీగ తానై 
పెంచుకుంటున్న,
ఆ ఆశలు, ఆ కోరికలు,
నేను అనే .... పందిరి చుట్టూ,
అల్లుకుపోతూ,
నాతో కూడా చెప్పని,
ఆ భావనల తీగల అనురాగం,
నాలో ఏదో ప్రత్యేకత ఉందని కాదు ....
తనలోని ప్రత్యేకత అనీ కాదు ,
ఈ విశాల ప్రపంచంలో,
ఒకరి కొకరమై,
ఆనందంగా, ఆహ్లాదంగా,
కడదాకా జీవించాలనే.


2 comments:

  1. కొంచెం అసంపూర్ణంగా వున్నదనిపించి , కొంచెం మార్పులు చేస్తున్నాను . సబబు అనిపిస్తే సరి చేయండి . లేదంటే లైట్ గా తీసుకోండి .

    తను పెంచుకుంటున్న ,
    ఆ ఆశలు , ఆ కోరికలు ,
    నేననే ఆ పందిరి చుట్టూ ,
    అల్లుకుపోతూ ,
    నాతో కూడా చెప్పని ,
    ఆ భావనల తీగల అనురాగం ,
    నాలో ఏదో ప్రత్యేకత ఉందని కాదు ....
    తనలోని ప్రత్యేకతని కాదు ,
    ఈ అనంత ప్రపంచంలో ,
    ఇరువురం ఒకరి కొకరమై ,
    ఆనందంగా , ఆహ్లాదంగా ,
    కడదాకా జీవించాలనే .

    ReplyDelete
    Replies
    1. కొంచెం అసంపూర్ణంగా వున్నదనిపించి, కొంచెం మార్పులు చేస్తున్నాను. సబబు అనిపిస్తే సరి చేయండి. లేదంటే లైట్ గా తీసుకోండి.

      తను పెంచుకుంటున్న,
      ఆ ఆశలు, ఆ కోరికలు,
      నేననే ఆ పందిరి చుట్టూ,
      అల్లుకుపోతూ,
      నాతో కూడా చెప్పని,
      ఆ భావనల తీగల అనురాగం,
      నాలో ఏదో ప్రత్యేకత ఉందని కాదు ....
      తనలోని ప్రత్యేకతని కాదు,
      ఈ అనంత ప్రపంచంలో,
      ఇరువురం ఒకరి కొకరమై,
      ఆనందంగా , ఆహ్లాదంగా,
      కడదాకా జీవించాలనే.

      నిండుతనాన్ని సమకుర్చుతున్న మీ సూచనను పాటించాను. ఎంతో సంతోషం గా ఉంది. మీ సలహాలు సూచనలూ పాటించాక కూడా ఇంకా పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి. అయినా మీరు నన్ను మన్నిస్తూనే ఉన్నారు. మీ సహనానికి అభివాదాలు శర్మ గారు! శుభమధ్యాహ్నం!!

      Delete