కత్తి ఎంత పదునైనదైనా,
అది ఎంత లోతుగా దిగినా, కాలం తో మానొచ్చు
కానీ,
కొన్ని గాయాలు .... అంతే! వైద్యవృత్తికే సవాలై
పీడ, నీడలు లా .... కనిపిస్తాయే కాని.
గుండె లోతుల్లో ఏర్పడిన గాయం .... తీవ్రమై
గడ్డకట్టిన చలి శిలనైన .... నా ముందు,
భారమైన ఏవో బాధ భావనలను గుమ్మరించినట్లు
నీ మౌనం పలుకులు
ఎంత విద్వంసం సృష్టిస్తున్నాయో .... నా లో
కత్తి దిగితేనే దాని లోతును తెలియచేస్గలదు . గాయాలు కనిపిస్తాయే గాని , మాయని మచ్చలుగా మిగిలిపోతాయి .
ReplyDeleteపీడ అనిపించగలదే కాని , కనిపించలేదు . నీడ మాత్రమే కనిపించగలదు .
గుండె లోతుల్లో గుచ్చుకున్న గాయాలు పైకి కనపడవు గాని , వున్న గుండెను , ఆకారం లేని మనసును మధన పెడ్తాయన్నది అక్షర సత్యం .
ఆ గుండె గాయం ' చలి తీవ్రతచే గడ్డ కట్టిన శిల కంటే , ఘోరంగా కరుడు గట్టిందని చెప్పాలన్న మీ అంతర్భావన చాలా చక్కగా వున్నది . కాకుంటే అంత యిదిగా చెప్పలేకపోయారన్న భావన నా చేత యిది వ్రాయించింది .
కత్తి దిగితేనే దాని లోతును తెలిసేది. గాయాలు కనిపిస్తాయి కాని, చివరికి అవి మచ్చలుగా మిగిలిపోతాయి. పీడ అనిపించగలదే కాని, కనిపించదు. నీడ మాత్రమే కనిపిస్తుంది. గుండె లోతుల్లో గుచ్చుకున్న గాయాలు పైకి కనపడవు గాని, వున్న గుండెను, ఆకారం లేని మనసును మధన పెడ్తాయన్నది అక్షర సత్యం. ఆ గుండె గాయం చలి తీవ్రతచే గడ్డ కట్టిన శిల కంటే, ఘోరంగా కరుడు గట్టిందని చెప్పాలన్న మీ అంతర్భావన చాలా చక్కగా వున్నది.
Deleteకాకుంటే అంత యిదిగా చెప్పలేకపోయారన్న భావన నా చేత యిది వ్రాయించింది .
నిజమే! మీ విశ్లేషణతో ఏకీభవిస్తున్నాను శర్మ గారు. భావనకు బలాన్ని సమకూర్చలేకపోతున్నాననేది నిజమే అనిపిస్తుంది. తప్పక ప్రయత్నిస్తాను మీ సూచనలకు న్యాయం చెయ్యడానికి
ధన్యాభివాదాలు శర్మ గారు!