కలలు
నిట్టుర్పులను రాయను .... నేనిక అని.
ఇప్పట్నుంచి
నీ స్పూర్తి
నీ ప్రభావం ఉండవు .... నాపై.
నా దినచర్యల్ని
నేనే చేసుకుపోతుంటాను.
నీ గురించి ఏ మాత్రమూ .... ఆలోచించకుండా,
అన్నీ నార్మల్ గా ....
తింటాను. తాగుతాను. తిరుగుతాను.
సినిమాలు చూస్తాను
ఆలోచిస్తాను, అందరిలా ....
నల్ల త్రాచులాంటి నీ కురులు,
నిండు తారల్లా మెరిసే నీ కళ్ళు,
ఆ చూపు అయస్కాంత శక్తి
నీవూ నేనే ఉన్నప్పుడు, గదిలో
ఒకప్పటిలా ....
ఇప్పుడవి నన్నేమాత్రం ప్రభావితం చెయ్యలేవు,
ఎవ్వరూ చూడనప్పుడు ఆన్ లైన్ లో
చదరంగం ఆడుకుంటానే కాని,
మునుపటిలా, నీ కొంగుకు వ్రేలాడి ....
ఏవో తుంటరి భావనల్ని
గజిబిజిగా రాసుకుని మదిలో .... తరువాత
ఏ కవిత గానో కథగానో
నిన్ను కేంద్రబిందువును చేసి .... రాసుకోను.
నియమబద్దం గా ....
సమయానికి పనికి వెళ్ళగలను.
పెళ్ళిచేసుకుని పిల్లల్ని కనగలను.
త్రాగి తినగలను.
సంపాదించిన డబ్బు ఆదా చెయ్యగలను మరణించేలోపు.
నేను చెబుతున్న ఈ చర్యలను
పాటించడం .... చాలా కష్టమని,
చెప్పినత సులభం కాదని
నిన్ను కోల్పోతానని తెలుసు.
ఊపిరాడని అధ్వాన్న స్థితే .... అయినా
నన్ను కాదనుకోవడాన్ని మించిన శిక్షని మాత్రం
అనుకోను.
పరితపించే హృఉదయాన్న్ని కళ్ళ ముందు పరిచారు.
ReplyDeleteపరితపించే హృదయాన్ని కళ్ళ ముందు పరిచారు.
Deleteబాగుంది స్పందన
చెలి కాదందని రోషపడిన ఒక మానవుడి మనోగతాన్ని సరిగ్గా చెప్పగలిగానో లేదో అనే మీమాంసను మీ స్పందన ద్వారా నివృతి చేస్తూ ఒక చక్కని ప్రోత్సాహక అభినందన
ధన్యవాదాలు మెరాజ్ గారు! శుభోదయం!!
తిరస్కార ప్రేమికుడి సంఘర్షణ చక్కగా రచించారు .
ReplyDeleteనిండు తారల్లా మెరిసే నీ కళ్ళు,
కంటే
నిగ నిగ మెరిసే తారల్లా కళ్ళలో
అది ఊపిరాడని అధ్వాన్న స్థితే .... అయినా
కంటే
ఊపిరాడని అధ్వాన్న స్థితే .... అయినా
నీవూ నేనే ఉన్నప్పుడు, గదిలో
ఒకప్పటిలా ....
ఇప్పుడవి నన్నేమాత్రం ప్రభావితం చెయ్యలేవు,
నీవు నన్ను కాదనుకోవడాన్ని మించిన శిక్షని మాత్రం అనుకోను.
కంటే
నన్ను కాదనుకోవడాన్ని మించిన శిక్షని మాత్రం
అనుకోను.
అంటే చాలా బాగుంటుంది .
తిరస్కార ప్రేమికుడి సంఘర్షణ చక్కగా రచించారు .
Deleteఅవును కొన్ని అవసరం లేని పదాలు
కవిత ప్రమాణికతను తక్కువ చెయ్యకుండా
మీ సూచనలు మీ సవరణలతో పోస్టింగ్ ను ఎడిట్ చేసాను.
తేడా ప్రస్పుటంగా కనిపిస్తుంది.
ధన్యాభివాదాలు శర్మ గారు! శుభసాయంత్రం!!