నన్ను నేను మభ్యపెట్టుకోలేకే .... దూరంగా ఉందామనే ఈ నిర్ణయం
పరిధులన్నింటినీ దాటి నిన్ను నీవు కోల్పోతావనే
నీలో ఏ మృధుత్వ ఆనంద పారవశ్యపు వెలుగులుండవనే
ఓ మహిళా .... నీది పసితనమనుకోనా? నీ నైజమే అది అనుకోనా?
ఏది ఏమైనా నీవు కోరుకున్నదే నీవు పొందడం న్యాయం
నీ ఆశలకు రూపమంటూ వొకటుంటే .... నిజం మహిళా! తుది నిర్ణయాధికారం నీదే!
కావాలనుకున్నంత మాత్రాన ఎవ్వరమూ ఏదీ పొందలేము.
ఏ స్త్రీనైనా ఆమెకై ఆమె కావాలనుకోనంతవరకూ
కళ్ళుండీ గుడ్డివాడిలా .... ముబావాన్ని, మౌనం అర్ధాంగీకారమనుకోలేను
బలవంతుడ్ని పరిస్థితులు నాకు సానుకూలంగా ఉన్నాయని,
నాకన్నా నీకన్నా బలమైనది ప్రేమ .... నిజం!
కోరుకోని ఎదను కోరుకోవడం .... స్వయంగా ఆత్మ ముందు దోషిగా నిలబడ్డమే
ఆ చూపుల్లోనే, మాటల్లో చెప్పలేని అర్ధం కాని లోతైన భావనలేవో
నీ అవసరాలు, నిన్ను ఆవహించి ఉన్న సమశ్యలే అయ్యుండొచ్చు
మరిచిపోలేని దుస్థితి నాది .... నిన్న పందిరిమంచం వద్ద నీ ప్రవర్తన
బలహీనుడ్నైపోతున్నాను గుర్తుతెచ్చుకుని .... కొన్ని ఇష్టాలు అంతే
కోల్పోవాల్సొస్తుందనుకున్నప్పుడు బలహీనత అన్నివైపుల్నుంచీ ఆవహిస్తూ
మంచిరోజులొస్తాయని మంచికోసం ఎదురుచూడొచ్చనిపిస్తుందిప్పుడు
నన్ను నేను కోల్పోకపోతే ధీరుడ్నై నిలబడితే .... నిజం గా
పరిపూర్ణంగా చదవలేకపోయిన నీకు .... దూరంగా ఉండాలనుకుంటున్నా
నీ మనసులో మరెవరూ లేరని తెలుసుకోగలిగే క్షణం వరకూ
నిన్ను పొందేందుకు ఎదురుచూస్తూ ..... మనఃపూర్వకంగా
నిన్ను స్వాగతించేందుకు .... ఒక జీవిత కాలం పాటు .... ఓ మహిళా!
ఈ కవితలో...ఓ పురుష హృదయం తనను తాను సమ్మాళించుకుంటూ.. స్త్రీని నిందించక అర్దం చేసుకుంటూ సాగిన వైనం కనిపిస్తుంది.
ReplyDeleteమీ రచనల్లో.. ఏదో కొత్తదనం ఉంటుంది. ఓ మంచి శైలి ఉంటుంది.
సర్, మహిళా అనే కంటే స్త్రీ అంటే బాగుండేదేమో..
ఈ కవితలో...ఓ పురుష హృదయం తనను తాను సమ్మాళించుకుంటూ ....
Deleteస్త్రీని నిందించక అర్దం చేసుకుంటూ సాగిన వైనం కనిపిస్తుంది.
మీ రచనల్లో .... ఏదో కొత్తదనం ఉంటుంది. ఓ మంచి శైలి ఉంటుంది.
సర్, మహిళా అనే కంటే స్త్రీ అంటే బాగుండేదేమో..
చక్కని పరిశీలన భావన సడలని ఒక మంచి సూచన .... ఎంతగానో ఆలోచించి (చెలీ. ప్రియా రెండూ అసంబద్దమనిపించి) మహిళ అనడం ద్వారా ఆ పాత్రకు వ్యక్తిత్వ ఆపాదన జరుగుటుందనిపించి
అలా రాయడం జరిగింది. స్త్రీ అనడం .... చాలా బాగుంటుంది.
_/\_లు మెరాజ్ ఫాతిమా గారు!