Saturday, July 5, 2014

జీవితమంటే



జమీందారులు,
కోటీశ్వరులు గా పుట్టి కొందరు? 
కూడు, గూడు,
గుడ్డకోసం పరితపిస్తూ
అస్తికలు అస్థిత్వమే ఆస్తులు గా 
అనాదలు గా పుట్టి
కొందరు

ఎందుకో .... కొందరు
దొడ్డిదారుల్లోనే నడుస్తూ
ఎప్పుడూ ....
కొందరికేమో
సింహద్వారాల అట్టహాసాల స్వాగతాలు!

కొందరికి ఒకేచోట పడుకోవాల్సిన అవసరం లేదా?
అవకాశం లేదా!
ఆ రైల్వే ప్లాట్ఫాంస్
ఆ ఫుట్ పాత్ లు
ఆ మూసిన దుఖాణాల అరుగులే విశ్రామ స్థలాలు!

మాదక ద్రవ్యాలకు లొంగి
మద్యం లో తేలిపోయి ఎందరో ....
ఎందుకలా?
చదువుకున్న జ్ఞానులై
పురుగుల్లా పాకులాడుతుంటారు?

జీవితాన్ని
ఒక పాటం లా, ఒక యజ్ఞం లా
ఒక చరిత్రకెక్కాల్సిన అక్షరక్రమం లా
అంకిత భావం తో తపిస్తూ
కొందరు .... ఎందుకలా?



జీవితాన్ని
ఒక పొందిన అవకాశం లా
ఆనందం కోసం, అనుభూతి కోసం ఖర్చుచేసుకుని
ఒంటరిలక్ష్యం వైపు కదులుతూ 
కొందరికి ఆ తహతహ ఎందుకో?

వాస్తవాలను పరిశీలిస్తే .... జీవితం పాటశాల లో
కాలం రాసుకుపోతున్న అధ్యాయాల సమీక్షలో 
అప్పుడో ఇప్పుడో .... అందరమూ
కొందరు స్వల్పంగా
కొందరు పొరపాట్లు చేసేందుకే జీవిస్తున్నామనిపిస్తుంది.

ఈ అనుభవం పాటాలు
ముందు తరానికి మార్గదర్శకం గా
స్నేహ పరిమళాలు పరుచుకుంటుండుతూ 
ఆనందానుభూతిని చెందటం ....
జీవితం అనుకుంటే ఎలా ఉంటుందీ అని .... నాలో!?

4 comments:

  1. జీవిత పాఠశాల చాలా విశాలమైనది,
    ప్రతి ఒక్కరికీ అడ్మిషన్‌ దొరుకుతుంది,
    కానీ భోదనే సరిగా దొరకదు.ఎన్నో పరీక్షల అనంతరం విపరీతమైన సిరా మరకలతొ.. చిరిగిపోయిన కాగితాన్ని చేతపట్టుకున్న నిత్య విద్యార్తులమై...ఇదిగో .ఇలా.. తపిస్తూ కవుల లా రూపాంతరమై.

    ReplyDelete
    Replies
    1. జీవిత పాఠశాల చాలా విశాలమైనది, అక్కద ప్రతి ఒక్కరికీ అడ్మిషన్‌ దొరుకుతుంది,
      కానీ భోదనే సరిగా దొరకదు. ఎన్నో పరీక్షల అనంతరం విపరీతమైన సిరా మరకలతొ ....
      చిరిగిపోయిన కాగితాన్ని చేతపట్టుకున్న నిత్య విద్యార్తులమై .... ఇదిగో .ఇలా .... తపిస్తూ
      కవుల లా రూపాంతరం చెంది
      ఆక్రోశిస్తూ
      ఎంత చక్కని పరిశీలన భావనాత్మక స్పందన.
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete
  2. భావం ఉన్నతంగా ఉన్నా , క్రమంలో కొంచెం లోపాలున్నట్లు తెలియవస్తుంది . అనుమతిస్తే , ఇంకా ఉన్నతంగా ఉండగలదని భావిస్తున్నాను .
    ఉదాహరణకి :
    జామీందారులుగా,
    కోటీశ్వరులు గా పుట్టడమా?
    లేక
    కూడు, గూడు,
    గుడ్డకోసం పరితపిస్తూ ,
    అస్తికల అస్థిత్వమే ఆస్తులు గా
    అనాధలుగా పుట్టడమా?

    ReplyDelete
    Replies
    1. భావం ఉన్నతంగా ఉన్నా, క్రమంలో కొంచెం లోపాలున్నట్లు తెలియవస్తుంది. అనుమతిస్తే, ఇంకా ఉన్నతంగా ఉండగలదని భావిస్తున్నాను .
      ఉదాహరణకి :

      జామీందారులుగా,
      కోటీశ్వరులు గా పుట్టడమా?
      లేక
      కూడు, గూడు,
      గుడ్డకోసం పరితపిస్తూ ,
      అస్తికల అస్థిత్వమే ఆస్తులు గా
      అనాధలుగా పుట్టడమా?

      మీకు నా వద్ద అనుమతి అక్కర లేదు. మీరు మందలించే చనువును ఎప్పుడైనా తీసుకొని నన్ను సవరించొచ్చు. మీ పరిశీలన సూచనను చదివాక చిన్న సవరణ కూడా చేసాను. క్రమాం సరిగ్గా కుదరలేదని. మీ సూచనలను సదా కోరుకుంటూ ....
      నమస్సులు శర్మ గారు! సుప్రభాతం!!

      Delete