Wednesday, July 16, 2014

మనవి చెయ్యాలని .... మరోసారి




నా జీవితం పేజీల్లోకి చూసుకుంటూ
మసకేసిన జ్ఞాపకాల్లో
మసక మసకగా కనిపిస్తున్న నిన్నూ నన్నూ చూస్తున్నా!
ఎన్నో తెలియకుండా మ్యానేజ్ చేసినా
తెలిసేలా చేసిన కొన్ని పొరపాట్ల పరిణామాలతో,
ఎన్నిసార్లు నీ సహకరాన్ని పొందాల్సొచ్చిందో 
ఎన్నిసార్లు నాతో కలిసి నీవూ
దొరికిపోవడానికి కారణం అయ్యానో .... ఆఖరి క్షణాల్లో
గుర్తుకు తెచ్చుకుంటున్నా!
జీవితం ఇంతదూరం ఎలా ప్రయాణించానో
నా కళ్ళలో నీళ్ళతో రాసుకుంటున్నా సమాధానాల్ని.
నీవు నాకు ఎదురైన ప్రతిసారీ
నాకు ఎదురొచ్చే ఏదో వింత నూతనత్వం తో
గాల్లో తేలిపోతున్న భావన తో
ఎన్నిసార్లు ముందుకన్నా అతిగా నిన్ను కోరుకున్నానో .....
ఈ రాతిరి నాకు నిదురించాలనిపించడం లేదు.
కలలతో కాలాన్ని కాలక్షేపం చెయ్యాలనుకుంటున్నా.
ఈ క్షణం వరకూ చూసుకుంటే ఈ జీవితం లో
నాకు నీపై నున్న ప్రేమే .... ఆద్యంతమూ



జీవించాను. ప్రేమించాను.
నన్ను నేను కోల్పోయాను
ఎన్నో ప్రతికూలతలకు స్పందిస్తూ
నరకాన్ని చూశాను. స్వర్గాన్నీ చూశాను
అన్ని సమయాల్లోనూ .... నా తోడు నీడగా
నేను చెప్పని, నేను చెయ్యని
ఎన్నో సమస్యల సమాధానావిగా .... నీవే
ఈ రాతిరి నిన్ను చూడాలనుంది .... కలలోనైనా సరే
ప్రపంచాన్ని నానుంచి దూరం చెయ్యొద్దని అడగాలని
ఎంత నువ్వే నేనైనా .... ఈ ముఖంపై
ఆ విషాద చాయలు చెరిపెయ్యమని, నా చేజారిపోవద్దని
నేనూ నీ ప్రేమ రూపాన్నే అని .... మనవి చెయ్యాలని మరోసారి

2 comments:

  1. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది భావం , రచన , నడక .

    బహు కొంచెం చిన్ని మార్పులు అవసరమనిపిస్తుంది . ఆలోచించండి .

    మసకమసగా కనిపిస్తున్న నిన్నూ నన్నూ చూస్తున్నా!
    మసక మసకగా కనిపిస్తున్న నిన్నూ నన్నూ చూస్తున్నా!

    తెలిసేలా చేసిన కొన్ని పొరపాట్ల పరిణామాలు
    తెలిసేలా చేసిన కొన్ని పొరపాట్ల పరిణామాలతో ,

    దొరికిపోవడానికి కారణం అయ్యానో .... ఆఖరి క్షణాల్లో
    దొరికిపోవడానికి కారణం అయ్యావో .... ఆఖరి క్షణాల్లో

    కలలతో కాలాన్ని వృధా చెయ్యాలనుంది.
    కలలతో కాలాన్ని కాలక్షేపం చెయ్యాలనుకుంటున్నా .

    నేనూ, నాకు నీపైనున్న ప్రేమే .... ఆధ్యంతమూ
    నాకు నీపై నున్న ప్రేమే .... ఆద్యంతమూ

    నరకాన్ని చూసాను. స్వర్గాన్నీ చూసాను
    నరకాన్ని చూశాను. స్వర్గాన్నీ చూశాను

    ఎన్నో సమశ్యల సమాధానావిగా .... నీవే
    ఎన్నో సమస్యల సమాధానావిగా .... నీవే

    ఈ రాత్తిరి నిన్ను చూడాలనుంది .... కలలోనైనా సరే
    ఈ రాతిరి నిన్ను చూడాలనుంది .... కలలోనైనా సరే

    ReplyDelete
    Replies
    1. "ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది భావం, రచన, నడక.
      బహు కొంచెం చిన్ని మార్పులు అవసరమనిపిస్తుంది. ఆలోచించండి."

      సహృదయం తో మీరు చేసిన సూచనలను కూర్చాను కవిత లో.
      కాస్త నిండుగా అనిపిస్తుందిప్పుడు
      అభివాదాలు మాష్టారు!

      Delete