Wednesday, May 14, 2014
Tuesday, May 13, 2014
నేనెవరినో నీకు తెలుసా!?
ఎవరైనా, ఏదో ఒక రోజు
చేరాల్సిన గమ్యాన్ని .... నేను
సాటి మనిషిని లా
ఎవరూ నన్ను మోసపుచ్చలేరు.
ఆనందం, ఉల్లాసం,
ఉన్నతశిఖర అధిరోహణలప్పుడు
ఎవరికీ నేను కానరాను.
కష్టాల వలలో చిక్కి
దిగులు సంద్రం లో
పీకలదాకా మునిగి,
ఎవరినైనా
వారు మోసం చేసిన నీడలే ....
వారి ఋణం తీర్చుకుంటున్నప్పుడు
నీడలా .... ఎదురుగా
చెయ్యందించేందుకు సిద్దమై
సమాధి లోంచి .... నేను,
సమాధిలోకి వారిని లాక్కుంటూ ....
ముందుగా
నేను లాక్కునేది మాత్రం
వారి శ్వాసనే!
బాధలనుంచి వారిని విముక్తుల్ని చేసేందుకు,
ఇంతకూ నేనెవరినో ఎవరికైనా తెలిసిందా?
మరణాన్ని .... శాశ్వతత్వాన్నని!
Sunday, May 11, 2014
మనం
ఏనాడో కలిసుండాల్సింది
కలిసి ఉండకపోవడమే, ఆశ్చర్యంగా ఉంది.
ఆ వెన్నెల వికసించే వేళ
నీవు,
నేను లేని బాధను
విరహ వేదన అనుభవిస్తున్నావు కదూ!
గాఢంగా ....,
చీకటి పొరల్ని, చకోరాల్ని
మృదువుగా స్పర్శించాలని
మదనపడుతున్నావు కదూ ....
నాలా
తల దాచుకుని
ఏ నక్షత్రాల నీడలోనో
మరో ఉదయం ప్రశ్నించే ప్రశ్నల సమాధానాలను
ఒంటరితనాన్ని ఎదుర్కోవడం ఇష్టం లేక,
నీకు
ఇక అంత అవసరం,
ఒంటరిగా ఉండాల్సిన స్థితి ఉండదు.
ఇద్దరం, ఇకపై
ఒకే కల కందాము.
ఒకే దుప్పటి పంచుకుందాము.
ఒకే కోరిక, ఒకే అవసరం .... ఒకే గాలిని శ్వాసిద్దాం!
బాహువులను తోడుంచుకుని
ఒకరికొకరం చేరువయ్యేందుకు
గుండెను గుండెకు హత్తుకుని
స్థిమితతను కలిగించుకునేందుకు ఉపక్రమించుదాం!
Saturday, May 10, 2014
ఆశ, ఆరాటం, తపన
అంతా జీవితమే! బ్రతుకు ఆటలో భాగమే,
వైఫల్యాలను తప్పించుకోవాలనే ప్రయత్నం లో
పాఠాలు నేర్చుకోవడం
ఆశల సమీపానికి చేరి వేటాడాలనుకోవడం
అప్పుడప్పుడూ అతిగా ప్రవర్తించడం.
నిజం!
దిగజారిన క్షణాల లోనే మనిషి
నిజ వ్యక్తిత్వం చూడగలిగేది.
కోరికలు తీర్చుకోవాలనే ప్రాకులాటలో
కొంచెం కొంచెం గా
అంతా ఆక్రమించుకోవాలనే .... ఆరాటం లో
స్వేచ్చగా ఎగరాలని, ఎగరలేక
పడిన ప్రతిసారీ
అదే ఆఖరి అనుభవం కావాలని ....
జాగ్రత్తగా ఉంటాను అని సర్ధి చెప్పుకోవడం లో,
గుండె ఆతురత, తొందరపాటును సర్ధుకోవడం లో,
అవును ప్రేయసీ ....
నా నొప్పిని నీవు చూడగలుగుతున్నావా?
నిజంగా నీకూ నొప్పిగా ఉందా?
దూరంగా నడుస్తూ .... వర్షం లో
నా అడుగులు తడబడుతున్నప్పుడు,
పశ్చాత్తాపం తో ....
జారుతున్న నా కన్నీళ్ళను
నీ ప్రేమ కొసం
పిడచకట్టుకుపోయిన నా పెదాల దాహాన్ని
కలల ఎండమావుల వెంట
పరుగులు తీయడం నీడలో
నా అరాటాన్ని గమనిస్తున్నావా?
నాలానే నీవూ తపిస్తున్నావా?
ప్రేమే కారణం .... అదే లేకపోతే
హృదయం యాంత్రికతతో చిలుము పట్టక తప్పదు.
అందుకే ప్రియా! ....
రా! నా చెయ్యందుకో!
నన్ను విశ్వసించు! నిన్ను విశ్వసిస్తున్నాను.
నా మోహావేశపు వెన్నెల వీధుల్లో నాతో కలిసి నర్తించుతావని .... ఆశగా
త త త త్ త్ త్ త్
తడబడుతుంటాను.
చిద్రమైపోతుంటాను .... మాట్లాడాల్సొచ్చిన ప్రతి సారీ
ఏడుస్తాను లోలోపల ....
మనసు భావనలను మాటలు లా పలుకలేక .... నత్తి తో
............
అక్షరమేదో పంజాలా నా గళంపై దాడి చేసినట్లు
పదాలు, పదబంధాలు
బిగుసుకుపోయిన గొంతులోంచి
కక్కి, దగ్గిన పదాలు అనర్ధవంతమవుతూ
...........
మదిలోంచి పళ్ళవరకూ వచ్చినట్లు వచ్చి
నైజాన్ని కోల్పోయి .... ఆగిపోయిన శబ్దం
పదం లో 'త ' అనే అక్షరం
గుండె లో ధమని వద్దే కొట్టుకుంటూ
.............
నాలో బాధ వినేవారికి ఆశ్చర్యం గా పరిణమించి
తల్లి, తండ్రి, తమ్ముడు
కేవలం 'త ' అనే అక్షరం
గొప్ప విషాదం 'త ' ను పలుకలేకపోవడం .... నేను
Friday, May 9, 2014
Subscribe to:
Posts (Atom)












